GRAND ANNUAL BRAHMOTSAVAMS OF SRI CHANDRA MOULEESWARA SWAMY AT RISHIKESH _ వైభవంగా రిషికేష్ శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
Tirupati, May 13, 2026: Annual Brahmotsavams of Lord Sri Chandramouleeswara Swamy are being celebrated grandly at the Andhra Ashram temple in Rishikesh on the banks of the holy Ganga amidst the Himalayas.
The celebrations commenced on May 12 and will conclude on May 16. Special arrangements have been made for the grand Kalyanotsavam to be held on May 15 at 4.30 PM.
As part of the festivities, devotees witnessed Surya Prabha Vahanam in the morning and Chandra Prabha Vahanam in the evening on May 13. Various spiritual, devotional and cultural programmes are also being organised daily by TTD projects.పత్రికా ప్రకటన
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
వైభవంగా రిషికేష్ శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
మే 15న వైభవోపేతంగా కల్యాణోత్సవం
తిరుపతి,2026మే 13: హిమాలయ పర్వత శ్రేణుల నడుమ పవిత్ర గంగాతీరాన వెలసిన రిషికేష్ ఆంధ్రాశ్రమంలోని శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. మే 12న ప్రారంభమైన ఈ ఉత్సవాలు మే 16వ తేదీ వరకు ఘనంగా నిర్వహించబడనున్నాయి. ఇందులో భాగంగా మే 15న జరిగే స్వామివారి కల్యాణోత్సవానికి ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు.
బ్రహ్మోత్సవాలలో భాగంగా మే 13న ఉదయం సూర్యప్రభ వాహనంపై, రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చి ఆధ్యాత్మికానందాన్ని పంచారు. మే 14న ఉదయం శేషవాహనం, రాత్రి గజవాహన సేవలు నిర్వహించనున్నారు.
మే 15న ఉదయం సింహవాహన సేవ అనంతరం రాత్రి శ్రీ స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. అనంతరం వృషభవాహన సేవ నిర్వహిస్తారు. మే 16న ఉదయం త్రిశూలస్నానం, తిరుచ్చి ఉత్సవం, సాయంత్రం ధ్వజావరోహణం, రావణాసుర వాహన సేవలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
మే 15న కల్యాణోత్సవం
బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన కల్యాణోత్సవం మే 15న సాయంత్రం 4.30 గంటలకు జరుగనుంది. గృహస్తులు (ఇద్దరు) రూ.501/- టికెట్ కొనుగోలు చేసి ఈ దివ్యోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవచ్చు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహిస్తూ భక్తులను అలరిస్తున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది
