GRAND CELEBRATION OF MATRUSRI TARIGONDA VENGAMAMBA JAYANTHI IN TIRUMALA _ తిరుమలలో ఘనంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి
Tirumala, 30 April 2026: The 296th Jayanthi celebrations of Matrusri Tarigonda Vengamamba, an ardent devotee of Sri Venkateswara Swamy, was held in a grand manner on Thursday evening at the Padmavathi Parinaya Mandapam in Narayanagiri Gardens, Tirumala.
Sri Malayappa Swamy, along with Sridevi and Bhudevi, was taken on a procession through the Mada streets of Tirumala to the venue. Artists from TTD Annamacharya Project and SV College of Music and Dance presented devotional group singing, rendering compositions written by Vengamamba.
On this occasion, Pushpagiri Peethadhipathi Sri Vidya Shankara Bharati Swamiji delivered a spiritual discourse. He stated that the Jeeva Samadhi of Vengamamba was a divine phenomenon, where the soul unites with the Supreme while the body still exists.
Temple Dy EO Sri Lokanatham, Tirupati Estate Officer Smt. Suvarnamma, other officials, and a large number of devotees participated in the event.
Floral Tributes paid
TTD officials and descendants of Vengamamba offered floral tributes at Vengamamba Brindavanam in Tirumala on Thursday evening.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో ఘనంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి
తిరుమల, 2026 ఏప్రిల్ 30: శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 296వ జయంతి ఉత్సవం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న పద్మావతి పరిణయ మండపంలో గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది.
ముందుగా శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి తిరుమల మాడవీధుల గుండా ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనాల్లోని పద్మావతి పరిణయ మండపానికి చేరుకున్నారు. అనంతరం టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల కళాకారులు గోష్టిగానం నిర్వహించారు. ఇందులో వెంగమాంబ రచించిన వివిధ సంకీర్తనలను కళాకారులు ఆలపించారు.
ఈ సందర్భంగా పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యా శంకర భారతి స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. తరిగొండ వెంగమాంబ సజీవ సమాధి అనే అద్భుతాన్ని మనం చూస్తున్నామని, సజీవ సమాధి అనేది శరీరం ఉన్నప్పటికీ ఆత్మ పరమాత్మతో ఐక్యమయ్యే అత్యున్నత యోగస్థితి అని తెలిపారు. మరణం, చీకటి వంటి భయాలను భగవన్నామస్మరణతో అధిగమించవచ్చని, ”ఓం నమో వెంకటేశాయ” అనే అష్టాక్షరీ మంత్రమే మోక్షానికి మార్గమని పేర్కొన్నారు. తిరుమల వంటి దివ్య క్షేత్రానికి రావడం తన పూర్వ జన్మ పుణ్యఫలమని, భగవన్నామస్మరణ ద్వారానే భక్తులు పరిపూర్ణ ఆనందాన్ని పొందగలరని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీమతి సువర్ణమ్మ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనంలో గురువారం సాయంత్రం టీటీడీ అధికారులు, వెంగమాంబ వంశీకులు పుష్పాంజలి ఘటించారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.









