GRAND CELEBRATION OF SRI SITA JAYANTI AT VONTIMITTA SRI KODANDARAMA SWAMY TEMPLE _ ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో వైభవంగా శ్రీ సీతా జయంతి

VONTIMITTA/TIRUPATI, 06 MAY 2025: Sri Sita Jayanti was celebrated in a grand religious manner on Tuesday at the Sri Kodandarama Swamy Temple in Vontimitta of Kadapa district.

As part of the celebrations, the day began with Suprabhatam, followed by sacred Tirumanjanam to the deities. 

Later, special rituals including Vyasabhishekam, Aaradhana, and Archana were performed for the presiding deities.

In the evening between 5PM and 6 PM, the Utsava idols of Sri Sita, Rama, and Lakshmana were ceremoniously seated on a beautifully decorated platform in Ranga Mandapam. 

A special “Vasantika Puja” was performed for  Sita Devi, amidst the rendering of Sahasranamarchana offering fragrant jasmine flowers.

Deputy EOs Sri Natesh Babu, Smt. Prashanti, Superintendent Sri Hanumanthayya, and Temple Inspector Sri Naveen Kumar, devotees participated in the event.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో వైభవంగా శ్రీ సీతా జయంతి

ఒంటిమిట్ట/తిరుపతి, 2025 మే 06: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో మంగళవారం శ్రీ సీతా జ‌యంతి ఉత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన చేశారు.

సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలోని రంగ మండ‌పంలో సర్వాంగ సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. ప్ర‌త్యేకంగా సీత‌మ్మ‌వారికి “వాసంతిక పూజ” మ‌ల్లె పూల‌తో స‌హ‌స్ర‌నామ అర్చ‌న నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీ నటేష్ బాబు, శ్రీమతి ప్రశాంతి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.