GRAND FINALE OF SRI PURANDARA DASA ARADHANOTSAVAM HELD _ ఘనంగా ముగిసిన పురందరదాసు ఆరాధనోత్సవాలు
Tirumala, 25 Jan. 20: The three day long Aradhanotsavam of Carnatic Music patriarch Sri Purandara Dasa concluded on a grand note on Saturday at the Asthana Mandapam in Tirumala.
Organised under the aegis of Dasa Sahitya Project of TTD, nearly 2500 followers of Purandara Dasa rendered suprabatham, dhyanam, and group bhajans in Tirumala. The artists of Haridasa Rasa Ranjani also rendered Purandara Dasa sankeertans
The Special Officer of Dasa Sahitya Project Sri Anandathirtha Charyulu supervised the arrangements.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఘనంగా ముగిసిన పురందరదాసు ఆరాధనోత్సవాలు
తిరుమల 2020, జనవరి 25 : తిరుమలలో గత మూడురోజులుగా టిటిడి దాససాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న కన్నడ సంగీత పితామహుడు పురందరదాసు ఆరాధన మహోత్సవాలు శనివారంనాడు ఆస్థాన మండపంలో ఘనంగా ముగిశాయి.
చివరిరోజున సుప్రభాతం అనంతరం దక్షిణాది రాష్ట్రాల నుండి విచ్చేసిన దాదాపు 2500 మంది పైగా పురందరదాసపరులు ఉదయం 6.00 నుండి 7.30 గంటల వరకు సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు హరిదాస రసరంజని కళాకారులతో పురందరదాస సంకీర్తనలను గోష్ఠిగానం ఆలపించారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకున్నారు.
కాగా ఈ కార్యక్రమాన్ని దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా|| ఆనందతీర్థాచార్యులు పర్యవేక్షించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.