GRAND FINALE OF SRIVARI FLOAT FESTIVAL (TEPPOTSAVAM) _ ఘనంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు
Tirumala, 17 Mar. 22: The five-day gala annual Srivari float festival (Teppotsavam) concluded on Thursday evening with the float ride of Sri Malayappa Swami along with consorts Sri Devi and Sri Bhudevi in the Swami Pushkarini.
Earlier the utsava idols of Swamy and Ammavaru were taken out in a grand procession on the Srivari Mada Streets. Later on, Sri Malayappa Swamy accompanied with his consorts rode the richly decorated float with flowers and glittering electric lights seven rounds and blessed devotees.
Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyar Swamy, Sri Sri Sri Chinna Jeeyar swamy, Addl EO Sri AV Dharma Reddy, SE-2 Sri Jagdeeshwar Reddy, DyEO Sri Haridranath, Peishkar Sri Srihari, VGO Sri Bali Reddy and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఘనంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు
తిరుమల, 2022 మార్చి 17: తిరుమలలో 5 రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు గురువారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు.
ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 గంటలకు విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీభూ సమేతంగా శ్రీమలయప్పస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షించారు. మంగళవాయిద్యాలు, వేదపండితుల వేదపారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, డెప్యూటీ ఈఓ శ్రీ హరీంద్రనాథ్, విజివో శ్రీ బాలిరెడ్డి, పేష్కార్ శ్రీ శ్రీహరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.