GRAND GALA OF CULTURAL PROGRAMMES _ శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు

GRAND GALA OF CULTURAL PROGRAMMES

TIRUPATI, 24 NOVEMBER 2022: The series of Devotional cultural programs arranged by TTD at different venues in Tirupati in connection with the annual Karthika Brahmotsavams in Tiruchanoor have been immensely attracting the denizens and devotees.

On Thursday, Mangaladhwani by Sri Raviprabha and Sri Satyanarayana, Spiritual discourses by Sri Ramachari, Harikatha by Smt Ramya Krishna Bhagavatar, flute by Smt Jayaprada Rama Murty, Kuchipudi by Dr. Srinivasulu are a few among many other devotional cultural performances that allured the art lovers.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కార్యక్రమాలు

తిరుపతి, 2022 న‌వంబ‌రు 24 ;శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు అమ్మవారి శోభను మరింత ఇనుమడింప చేశాయి. ఇందులో భాగంగా తిరుచానూరులోని ఆస్థానమండపంలో నిర్వహించిన కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తిరుచానూరు ఆస్థానమండపంలో ఉదయం 5 నుండి 6 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ రవిప్రభ మరియు శ్రీ సత్యనారాయణ బృందం మంగళధ్వని, ఉద‌యం 6 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులతో వేద పారాయణం నిర్వహించారు

ఉదయం 10 నుండి 11 గంటల వరకు మహబూబ్ నగర్ కు చెందిన శ్రీరామాచారి ధార్మికోప‌న్యాసం, ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి అన్నపూర్ణ బృందం వారిచే భక్తి సంగీత కార్యక్రమం జరిగింది.

అనంత‌రం మధ్యాహ్నం 3 నుండి 4.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి రమ్యకృష్ణ భాగ‌వ‌తార్‌ హరికథ పారాయణం చేశారు. సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ రఘునాథ్ బృందం అన్నమయ్య విన్నపాలు, తుంకూర్ కు చెందిన శ్రీ సుజయ్ కృష్ణ ఉంజల్ సేవలో అన్నమయ్య సంకీర్తన‌ల‌ను గానం చేశారు.

అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 గంటల నుండి సికింద్రాబాద్ కు చెందిన చెందిన శ్రీమతి జయప్రద రామమూర్తి బృందం ఫ్లూటు, అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 గంటల నుండి హైదరాబాదుకు చెందిన
శ్రీ వెంకటేశ్వర్లు బృందం సంగీతం, రామ‌చంద్ర పుష్క‌రిణి వ‌ద్ద కడపకు చెందిన శ్రీమతి శశికళ బృందం భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వ‌హించారు.

తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 గంటల నుండి కృష్ణాజిల్లా కూచిపూడికి చెందిన డాక్టర్ శ్రీనివాసులు బృందం కూచిపూడి నృత్య కార్యక్రమం జరిగింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.