GRAND KAKA BALI RITUAL HELD AT SRIVARI TEMPLE _ తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ”కాకబలి”

Tirumala, 15 Jan. 21: As part of the annual Kanuma festival, the traditional practice of Kaka Bali was performed at the Srivari temple on Friday morning.

The ritual of Kaka Bali was conducted at 3.30 am between Tomala Seva and Koluvu at the temple which included an offering of cooked rice separately mixed with turmeric and vermilion and offered to Sri Vimana Venkateswara in the Ananda Nilaya Gopuram.

Temple DyEO Sri Harindranath and other officials were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ”కాకబలి”

తిరుమల, 2021 జనవరి 15: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి ఏడాది కనుమ పండుగను పురస్కరించుకుని ఉదయాత్పూర్వం నిర్వహించే ”కాకబలి” కార్యక్రమం శుక్ర‌వారం వైదికోక్తంగా జరిగింది.

ఉదయం 3 గంటలకు తోమాలసేవ, కొలువు మధ్యలో కాకబలిని అర్చక స్వాములు నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ వేరువేరుగా కలిపిన అన్నాన్ని ఆనంద నిలయం విమాన వేంకటేశ్వరస్వామివారికి నివేదించారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.