GRAND KAVACHA PRATISHTHA HELD AT SRI GOVINDARAJA SWAMY TEMPLE _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా కవచ ప్రతిష్ఠ

  •  SPECIAL RITUALS PERFORMED ON THE SECOND DAY AT JYESHTABHISHEKAM

•  TIRUCHI PROCESSION FILLS DEVOTEES WITH DIVINE BLISS

Tirupati, July 25, 2026: The Kavacha Pratishtha Mahotsavam was conducted with great religious fervour on Saturday, the second day of the annual Jyeshtabhishekam at Sri Govindaraja Swamy Temple, Tirupati, amidst Vedic chants and traditional music.

The day began with Shata Kalasa Snapanam and Maha Shanthi Homam. Later, Snapana Tirumanjanam was performed to the processional deities of Sri Govindaraja Swamy along with Sridevi and Bhudevi in the Kalyana Mandapam. The deities were ceremonially bathed with milk, curd, honey, coconut water, turmeric and sandalwood, followed by special worship.

After the rituals, the Kavacha Pratishtha was performed in a grand manner.

In the evening, Sri Govindaraja Swamy, accompanied by Sridevi and Bhudevi, was taken in a Tiruchi procession through the four Mada Streets of the temple. Devotees had divine darshan and joyfully chanted “Govinda… Govinda…”, creating a spiritually vibrant atmosphere.

HH Pedda Jeeyar Swamy, HH Chinna Jeeyar Swamy, Temple Deputy EO Smt. Shanthi, AEO Sri A.B. Narayana Choudary, Superintendent Sri Seshagiri, Temple Inspector Sri Dhananjayulu, temple priests, officials and a large number of devotees participated in the celebrations.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా కవచ ప్రతిష్ఠ

•  జ్యేష్ఠాభిషేకాల్లో రెండో రోజు శాస్త్రోక్తంగా విశేష పూజలు

•  భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తిన తిరుచ్చి ఉత్సవం

తిరుపతి, 2026 జూలై 25: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జరుగుతున్న వార్షిక జ్యేష్ఠాభిషేక మహోత్సవాల్లో రెండో రోజు శనివారం కవచ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా, వేదఘోషలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉదయం శతకలశ స్నపనం, మహాశాంతి హోమం వైదిక పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయ కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనంతో అభిషేకాలు జరిపి విశేషారాధనలు సమర్పించారు.

తదనంతరం ప్రత్యేక పూజల అనంతరం కవచ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు.

సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనం ప్రసాదించారు. స్వామివారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులు “గోవింద… గోవింద…” నామస్మరణతో ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ఏ.బి. నారాయణ చౌదరి, సూపరింటెండెంట్లు శ్రీ శేషగిరి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనంజయులు, ఆలయ అర్చకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది