GRAND MAHA SAMPROKSHANA PROGRAM AT VIZAG SRIVARI TEMPLE _ విశాఖ‌లో శ్రీ‌వారి ఆలయంలో శాస్త్రోక్తంగా వైదిక కార్యక్రమాలు

Tirupati,20,March 2022: TTD organized various programs at the Srivari temple, Visakhapatnam on, Sunday as part of ongoing 3 days of Maha Samprokshana celebrations 

From morning to evening,Homas and other vaidika programs were performed at the yagashala.On Monday,21 March rituals of Jaladhivasa, Ratna Vyasa, Vimana Kalasha sthapana will be performed, and later Homas, etc will continue in the yagashala.

TTD DyEO Sri Ramana Prasad, Dharmic projects OSD Sri Vijayasaradhi, Vaikhanasa Agama adviser Sri Vishnu Bhattacharya, Tirumala Srivari temple chief archaka 

Sri Venugopal Dikshitulu and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

విశాఖ‌లో శ్రీ‌వారి ఆలయంలో శాస్త్రోక్తంగా వైదిక కార్యక్రమాలు

తిరుపతి, 2022 మార్చి 20 ;విశాఖ‌ప‌ట్నంలో టిటిడి నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో మూడవ రోజైన ఆదివారం వైదిక కార్య‌క్ర‌మాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, సాయంత్రం 6 నుండి హోమం, యాగ‌శాల కార్య‌క్ర‌మాలు నిర్వహించారు.

కాగా మార్చి 21న సోమ‌వారం ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట‌ వ‌ర‌కు హోమం, జ‌లాధివాసం, యాగ‌శాల కార్యక్ర‌మాలు, ర‌త్న‌న్యాసం, విమాన క‌ల‌శ‌స్థాప‌న‌, బింబ‌స్థాప‌న‌, సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు హోమం, యాగ‌శాల కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

ఈ కార్య‌క్రమాల్లో డిప్యూటీ ఈవో శ్రీ రమణ ప్రసాద్, ధార్మిక ప్రాజెక్టుల కార్యక్రమాల అధికారి శ్రీ విజయసారధి, వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ విష్ణుబ‌ట్టాచార్యులు, తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కుల్లో ఒక‌రైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, అర్చ‌కులు పాల్గొన్నారు. 

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.