GRAND MRULINGARCHANA AT DHYANARAMAM _ ధ్యానారామంలో శాస్త్రోక్తంగా మృల్లింగార్చన
Tirumala, 19 Mar. 21: As part of the Phalguna Masa Utsavam, TTD organised Mrulingarchana at the Dhyanaramam in SV Vedic University premises on Friday morning.
The SVBC live telecasted the sacred abhisekam event between 8am and 9am for benefit of global devotees.
After the Ganapati puja, Punyahavachanam and Kalasharadhana, the Shiva Linga made of holy mud was offered abhisekam to derive positive benefits for humanity as depicted in Purana.
The SV Vedic University Vice-Chancellor Acharya Sannidhanam Sudarshan Sharma and other Veda pundits and Acharyas were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ధ్యానారామంలో శాస్త్రోక్తంగా మృల్లింగార్చన
తిరుమల, 2021 మార్చి 19: టిటిడి చేపట్టిన ఫాల్గుణ మాస ఉత్సవాల్లో భాగంగా షష్ఠి తిథిని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆవరణలో గల ధ్యానారామంలో మృల్లింగార్చన జరిగింది. ఈ సందర్భంగా మృల్లింగానికి అభిషేకాలు నిర్వహించారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన నిర్వహించారు. అనంతరం మృల్లింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర పంచామృతాలతో, నమక, చమక మంత్రసహితంగా అభిషేకించారు. ఫాల్గుణ మాసం షష్ఠి రోజున మట్టితో చేసిన శివలింగాని అభిషేకించడం వలన లోక కల్యాణం, ప్రపంచంలోని సకల జీవులకు శుభఫలితాలను ఇస్తుందని వరాహపురాణంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవికి వివరించానట్లు పండితులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీ వేద వర్సిటీ ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ, వేద వర్సిటీ ఆచార్యులు, వేదపండితులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.