GRAND PROCESSION OF MUTHYALA TALAMBRALU _ ఘనంగా ముత్యాల తలంబ్రాల ఊరేగింపు

Tirupati,11 April 2022: As part of Sri Sita Rama Kalyanam fete at Sri Kodandarama Swamy temple in Tirupati a spectacular procession of pearl Talambralu was organised from TTD administrative building to the temple premises by TTD officials who earlier performed special pujas at the TTD treasury wing on Monday.

JEO Sri Veerabrahmam carried the precious pearls and handed it over to chief archaka Sri Ananda Kumar Dikshitulu. The holy pearls were carried on an elephant Ambari to Sri Kodandarama Swamy temple across pilgrim city.

 

Later speaking on the occasion the TTD JEO said the pearls etc. were taken for the evening event of Sri Sita Rama Kalyanam. After the Kalyanam, the utsava idols will be paraded on the Mada streets of the temple.

Temple Special Grade DyEO Smt Parvati, AEO Sri Durga Raju, Superintendent Sri Ramesh, Temple inspectors Sri Muniratnam and Sri Jayakumar were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఘనంగా ముత్యాల తలంబ్రాల ఊరేగింపు
 
 తిరుప‌తి, 11 ఏప్రిల్‌ 2022: తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం ముత్యాల తలంబ్రాల ఊరేగింపు ఘనంగా జరిగింది. ముందుగా టిటిడి పరిపాలనా భవనంలోని ఖజానా విభాగంలో టిటిడి అధికారులు ముత్యాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 
ఈ సందర్భంగా జెఈఓ శ్రీ వీరబ్రహ్మం ముత్యాలను ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీ కోదండరామాలయ ప్రధాన అర్చకులు శ్రీ ఆనందకుమార్‌ దీక్షితులకు అందించారు. అక్కడినుండి అంబారీపై ముత్యాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ఊరేగింపు తీర్థకట్ట వీధి, గాంధీ రోడ్డు,  శ్రీగోవిందరాజస్వామివారి ఆలయ దక్షిణ మాడ వీధి, బజారు వీధి గుండా ఆలయానికి చేరుకుంది. 
 
ఈ సందర్భంగా జెఈవో  మాట్లాడుతూ సాయంత్రం జరిగే శ్రీ సీతారాముల కల్యాణం కోసం తలంబ్రాలను ఊరేగింపుగా తీసుకెళుతున్నట్టు తెలిపారు. కల్యాణం అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారని చెప్పారు. 
 
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం‌, శ్రీ జయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.