GRAND PUSHPA YAGAM AT THALLAPAKA _ తాళ్ళపాక శ్రీ సిద్ధేశ్వరస్వామి, శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాలలో వైభవంగా పుష్పయాగం
Tirupati, 15 July 2025: The annual Pushpayagam was performed on Tuesday evening at Sri Siddheswara Swamy and Sri Chennakesava Swamy temples in Thallapaka of Annamayya district.
In the evening at 6 PM, the Pushpayagam was performed amidst Vedic chants and traditional music, using 12 varieties of flowers and 4 types of sacred leaves like tulasi, maruvam, and dhavanam.
Devotees were spiritually immersed in the divine experience.
Temple officials, priests, and a large number of devotees participated in the event.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తాళ్ళపాక శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయాలలో వైభవంగా పుష్పయాగం
తిరుపతి / తాళ్ళపాక, 2025 జూలై 15: అన్నమయ్య జిల్లా తాళ్ళపాకలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయాలలో మంగళవారం సాయంత్రం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది.
ఇందులో భాగంగా ఉదయం 9 గం.లకు శ్రీ కామాక్షి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామివారికి, శ్రీ చెన్నకేశవ స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.
సాయంత్రం 6 గంటల నుండి అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం వైభవంగా జరిగింది. చామంతి, గన్నేరు, మల్లెలు, కనకాంబరాలు, రోజా, సంపంగి, తామర, కలువ, తులసి, దవనము వంటి పుష్పాలు, ఆకులతో స్వామి, అమ్మవార్లకు యాగం నిర్వహించారు. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.
జూలై 6 నుండి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించిన విషయం విదితమే. బ్రహ్మోత్సవాల్లో, నిత్య కైంకర్యాల్లో తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈయాగం నిర్వహణ వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
