GRAND PUSHPA YAGAM HELD AT SRI SOUMYANATHA SWAMY TEMPLE, NANDALUR _ నందలూరులో శ్రీ సౌమ్యనాథ స్వామివారికి వైభవంగా పుష్పయాగ మహోత్సవం

Tirupati/Nandalur, July 31, 2026: Performed with 18 varieties of flowers and six sacred leaves

The Pushpayagam was performed with religious fervour at Sri Soumyanatha Swamy Temple in Nandalur on Friday, following the conclusion of the annual Brahmotsavams, as a ritual of atonement for any inadvertent lapses during the festivities.

Nearly one tonne of fragrant flowers was offered to the Lord amid Vedic chanting and traditional music.

 Special worship was performed with 18 varieties of flowers and six sacred leaves.

The beautifully decorated deity attracted a large number of devotees, who participated in the sacred ritual and later witnessed the Veedhi Utsavam held amid devotional chanting of Govinda Nama.

Temple AEO Sri Ravi, Temple Inspector Sri Dileep, officials, priests, staff and a large number of devotees participated.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

నందలూరులో శ్రీ సౌమ్యనాథ స్వామివారికి వైభవంగా పుష్పయాగ మహోత్సవం

18 రకాల పుష్పాలు, ఆరు రకాల పవిత్ర పత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహణ

తిరుపతి/నందలూరు, 2026 జూలై 31: నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో శుక్రవారం పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించారు. జూలై 22 నుంచి 30వ తేదీ వరకు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో, నిత్యకైంకర్యాల్లో అనుకోకుండా జరిగిన లోపాల పరిహారార్థం ఆలయ ఆగమ సంప్రదాయం ప్రకారం ఈ పుష్పయాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

సాయంత్రం వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ సుమారు ఒక టన్ను సుగంధ పుష్పాలతో స్వామివారికి పుష్పయాగం ఘనంగా సమర్పించారు. తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువ తదితర 18 రకాల పుష్పాలు, ఆరు రకాల పవిత్ర పత్రాలతో విశేష అర్చన నిర్వహించి స్వామివారిని భక్తిశ్రద్ధలతో సేవించారు.

రంగురంగుల పుష్పాలతో అలంకరించిన శ్రీ సౌమ్యనాథ స్వామివారి దివ్యసన్నిధి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పుష్పయాగ మహోత్సవాన్ని దర్శించుకుని స్వామివారి కృపాకటాక్షాలను పొందారు. అనంతరం గోవింద నామస్మరణల నడుమ స్వామివారి వీధి ఉత్సవం ఆధ్యాత్మిక వైభవంతో సాగింది.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ రవి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దిలీప్, ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.