GRAND RATHA SAPTHAMI AT SRI PAT _ సప్తవాహనాలపై సిరులతల్లి అభయం

Tiruchanoor, 01 Feb. 20:The unique festival of Ratha Sapthami and Surya Jayanti commenced at the Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor with the awesome Surya Prabha vahanam on Saturday morning.

It is a popular practice of TTD to conduct seven vahana sevas on a single day today to bless a vast galaxy of devotees. Goddess took out a celestial ride on Hamsa, Aswa, Garuda, Chinna Sesha Vahanam in the morning hours and the afternoon break was filled up with spectacular snapana thirumanjanam. Later in the evening, the Goddess marched along the four Mada streets on bewitching Chandra Prabha Vahanam and concluded with Gaja Vahanam.

TTD also rolled out Aswa vahanam at Sri Suryanarayana Swamy temple in Tiruchanoor on Saturday morning.

DyEO Smt Jhansi Rani, AEO Sri Subramanyam, Superintendent Smt Malleswari and other officials and devotees participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI 

సప్తవాహనాలపై సిరులతల్లి అభయం

తిరుపతి, 2020 ఫిబ్ర‌వరి 01: సూర్యజయంతిని పురస్కరించుకొని తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో రథసప్తమి వేడుకలు శ‌నివారం ఘనంగా జరిగాయి. ఒకేరోజు ఏడు వాహనాలపై అమ్మవారు దర్శనమివ్వడంతో ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలను తలపించాయి. ఉదయం భానుని రేఖలు సూర్యప్రభ వాహనంలో కొలువైన అమ్మ‌వారిపై ప్రసరించడాన్ని భక్తులు దర్శించుకుని ఆనందపరవశులయ్యారు.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి పర్వదినం సందర్భంగా శ‌నివారం ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారు ఏడు వాహనాలపై భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఉదయం 7.00 గంటలకు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై మధ్యాహ్నం 2.00 గంటల వరకు అమ్మవారు హంస, అశ్వ, గరుడ, చిన్నశేష వాహనాలపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా జరుగనుంది. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చంద‌నంతో అభిషేకం నిర్వ‌హిస్తారు.
     

కాగా సాయంత్రం 6.00 నుండి రాత్రి 7.00 గంటల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు గజ వాహనంపై అమ్మవారు దర్శనమివ్వనున్నారు.

శ్రీ సూర్య‌నారాయ‌ణ‌స్వామివారి ఆల‌యంలో….

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయంలో ఉదయం 6 గంటలకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు.
       

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచారపరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో  భజన బృందాలు పాల్గొన్నాయి. కోలాటాలు, చెక్కభజనలు, చిడతల భజన తదితర ప్రదర్శనలిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి ఝూన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ‌మ‌తి మ‌ల్లీశ్వ‌రి, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.