GRAND RATHOTSAVAM MARKS HELD _ వైభవంగా శ్రీ కోదండరాముని రథోత్సవం

VONTIMITTA /TIRUMALA, 12 APRIL 2025: Grandeur marked Rathotsavam on the seventh day of the ongoing annual Brahmotsavams at Sri Kodandarama temple in Vontimitta of Kadapa district on Saturday.

The traditional wooden chariot procession commenced at 10:30am and glided along the streets of the temple till evening before reaching the Ratha Mandapam.

Besides the local devotees, denizens from surrounding villages also pulled the mammoth wooden chariot with religious gaiety and enthusiasm. 

The Additional EO of TTD Sri Ch Venkaiah Chowdary, JEO Sri Veerabrahmam, engineering officers, DyEO Sri Natesh Babu and others participated.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

వైభవంగా శ్రీ కోదండరాముని రథోత్సవం

ఒంటిమిట్ట/ తిరుపతి 2025 ఏప్రిల్ 12: ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

ఉదయం 10.30 గంటలకు రథోత్సవం ప్రారంభమైంది.

శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాములవారు రథాన్ని అధిష్టించి గ్రామవీధుల్లో విహరించారు. భజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలు చేస్తుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు.

ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే.

ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వి వీరబ్రహ్మం, డెప్యూటీ ఈవో శ్రీ‌ నటేష్ బాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్, ఇంజినీరింగ్ అధికారులు, పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది