GRAND SHOBA YATRA BY DSP _ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో వైభవంగా భజనమండళ్ల శోభాయాత్ర

Tirupati, 29 November 2022: As part of the three-day long Tri-monthly Metlotsavam fete TTDs Dasa Sahitya Project on Tuesday organised a grand Shobha yatra of bhajan mandals in pilgrim city.

Earlier in the morning at the Third Choultry behind the railway station, the Bhajan mandals conducted  Suprabatam, Dhyana and bhajans followed by sankeetans and later dharmic discourse.

Shobha yatra began after special pujas performed by DyEO of Sri Govindarajaswami temple Smt. Shanti and Special Officer of DSP Sri Ananda Thirthacharyulu.

More than 3500 bhajan Mandal members from AP, Telangana and Karnataka participated in the Shobha yatra.

On December 1, Metlapuja will be performed at Alipiri Padala Mandapam in which several prominent leaders will participate and take footpath to Tirumala with Sankeertans and Bhajans throughout the route.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో వైభవంగా భజనమండళ్ల శోభాయాత్ర

తిరుపతి, 29 నవంబరు 2022: టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనమండళ్ల శోభాయాత్ర మంగళవారం సాయంత్రం వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరుగనున్న శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాల ప్రారంభంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

తిరుపతి రైల్వేస్టేషన్‌ వెనక వైపు గల మూడో సత్ర ప్రాంగణంలో ఉదయం 5 నుండి 7 గంటల వరకు భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 8.30 నుండి 10 గంటల వరకు సంకీర్తనాలాపన జరిగింది. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ధార్మిక సందేశం అందించారు.
సాయంత్రం 4 గంటలకు
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వద్ద డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతితో కలిసి టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీఆనందతీర్థాచార్యులు పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ, హరినామసంకీర్తన ప్రజల్లో అశాంతిని దూరం చేస్తుందన్నారు. కలియుగంలో స్వామివారిని సేవించడం ఎంతో పుణ్యఫలమన్నారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి విచ్చేసిన 3500 మందికిపైగా భజనమండళ్ల సభ్యులు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి శోభాయాత్రగా రైల్వేస్టేషన్‌ వెనకవైపు గల మూడో సత్రం ప్రాంగణానికి చేరుకున్నారు. దారి పొడవునా వారు చేసిన భజనలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి.
సాయంత్రం 6 గంటల నుండి సంగీత విభావరి,సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

డిసెంబర్ 1న ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాలమండపం వద్ద ప్రముఖులతో మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.