GURUVAYUR KRISHNA ON CHINNA SESHA _ చిన్నశేష వాహనంపై గురువాయూరు శ్రీకృష్ణడి అలంకారంలో శ్రీ ‌మలయప్ప ద‌ర్శ‌నం

TIRUMALA, 25 SEPTEMBER 2025: The ongoing annual brahmotsavams on second morning witnessed Sri Malayappa decked as Sri Guruvayur Krishna to bless His devotees.

The five hooded serpent king believed to be Vasuki carried his Master and paraded along four mada streets.

Both the senior and junior pontiffs of Tirumala, Chairman Sri BR Naidu, EO Sri AK Singhal and others were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

చిన్నశేష వాహనంపై గురువాయూరు శ్రీకృష్ణడి అలంకారంలో శ్రీ‌ మలయప్ప ద‌ర్శ‌నం

తిరుమల, 2025 సెప్టెంబరు 25: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై గురువాయూరు శ్రీకృష్ణడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగ‌ళ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.

చిన్న‌శేష వాహనంకుటుంబ శ్రేయస్సు

చిన్నశేషుడిని వాసుకి(నాగ‌లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.

వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ‌ర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ‌ర్ స్వామి, టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, బోర్డు స‌భ్యులు, సివిఎస్వో శ్రీ ముర‌ళికృష్ణ‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది