”HAMSA LAKSHMULU” STANDS UNIQUE _ హంసవాహన సేవలో ప్రత్యేక ఆకర్షణగా “హంస లక్ష్ములు”

TIRUPATI, 29 NOVEMBER 2024: The second evening on Friday witnessed the performances of 256 artistes hailing from a Dozen troupes.

The various artists showcased their dancing expertise in front of Hamsa Vahanam and charmed the devotees.

Hamsa Lakshmulu, peacock dance, kailkutti kali, folk dance, Garagallu and many other interesting dance themes were displayed on the occasion.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

హంసవాహన సేవలో ప్రత్యేక ఆకర్షణగా “హంస లక్ష్ములు”

తిరుపతి, 2024 నవంబరు 29: శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన శుక్రవారం రాత్రి హంస వాహన సేవలో 12 కళా బృందాలకు చెందిన 256 మంది కళాకారులు తమ నాట్య ప్రావీణ్యాన్ని ప్రదర్శించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు.

ఈ సందర్భంగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన కళాకారులు హంస లక్ష్ములు, నెమలి నృత్యం, కైల్‌కుట్టి కాళి, జానపద నృత్యం, గరగల్లు, కోలాటాలు వంటి పలు ఆసక్తికరమైన నృత్యాలు భక్తులకు కనువిందు చేశారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.