HAND STICKS TO DEVOTEES ON FOOTPATHS TO BOOST UP THEIR CONFIDENCE LEVELS ONLY-TTD CHAIRMAN _ భక్తుల్లో ఆత్మస్థైర్యం నింప‌డానికే చేతిక‌ర్ర‌లు – టీటీడీ ధ‌ర‌క్మ‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి

Tirumala, 06 September 2023: TTD Chairman Sri Bhumana Karunakara Reddy along with the TTD EO Sri AV Dharma Reddy on Wednesday evening launched the program of distributing hand sticks to devotees on footpaths at Alipiri Padala Mandapam as part of an exercise to give them self confidence against wild beasts attacks, etc, if any.

Speaking to media on the occasion the TTD Chairman said that it was scientifically proven and since times immemorial the practice of carrying sticks while crossing dense woods or during hunting expeditions as a protective measure to scare wild animals with hand sticks and the provision was not aimed at fighting the wild animals.

He said devotees were sent in groups on footpaths with security guards and police personnel were also stationed at frequent distances and wild animal-prone Zones on the route.TTD efforts to contain the wild animal attack threat had yielded results with the trapping of four leopards.

The hand sticks will be taken back from devotees after they reach Sri Narasimha Swami temple and will be supplied to devotees on a rotation basis.

He also left it to the wisdom of critics on the hand sticks exercise to find fault with TTD enterprise in the safety of Srivari devotees.

TTD EO Sri AV Dharma Reddy said several safety initiatives were rolled out by TTD after the June 22 incident at the 7th mile and August 11 at the Sri Narasimha Swami temple areas.

Among them was the installation of 500 CC Camera traps to identify the movement of wild animals and their capture besides driving wild animals into deep forests from the footpaths, stoppage of sale of fruits and vegetables offered as feed to friendly animals like deer, monkeys, etc as a step to stop wild animals approaching footpaths for sake of animals

He said movement of wildlife was identified near Shila Thoranam and the 7th mile on Alipiri footpath. In view of the above, devotees in groups of 100 are advised to move on the footpath along with security personnel, chanting Govinda Nama.

The devotees are also informed of being cautious about wildlife activity every five minutes through the broadcasting system. The forest department has also recruited 100 staff to watch the safety of devotees on the routes.

TTD EO said currently devotees with below 12 years old children are allowed to trek on footpaths till 2 pm in the afternoon. Two-wheelers are also allowed on Ghat Road from morning 6.00 a.m. to evening 6.00 p.m.

TTD has also sent proposals with designs to the Wildlife Institute of India and Union Forest Ministry for the construction of steel fencing in the Alipiri footpath route which falls in the reserved forest zone.

He said only 10,000 handsticks were prepared at a cost of ₹45,000 and the exercise is not aimed at any destruction of forest wood at all.

TTD JEO Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, CEO SVBC Sri Shanmukh Kumar, SE-2 Sri Jagadeeshwar Reddy, Dy CF of TTD Sri Srinivasulu, Tirupati DFO Sri Satish were also present.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

భక్తుల్లో ఆత్మస్థైర్యం నింప‌డానికే చేతిక‌ర్ర‌లు

– టీటీడీ ధ‌ర‌క్మ‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి

– అలిపిరిలో భ‌క్తుల‌కు చేతిక‌ర్ర‌ల పంపిణీ ప్రారంభం

 తిరుమల, 2023 సెప్టెంబరు 06 ; అలిపిరి న‌డ‌కమార్గంలో క్రూర‌మృగాల సంచారం నేప‌థ్యంలో అనేక భ‌ద్ర‌తా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని, ఇందులో ఒక చ‌ర్య‌గా భక్తుల్లో ఆత్మస్థైర్యం నింప‌డానికి చేతిక‌ర్ర‌లు అంద‌జేస్తున్నామ‌ని టీటీడీ ధ‌ర‌క్మ‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి తెలిపారు. అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి ఛైర్మ‌న్ బుధ‌వారం భ‌క్తుల‌కు చేతిక‌ర్ర‌ల‌ను అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ చేతిక‌ర్ర‌లతో భ‌క్తులు క్రూర‌మృగాల‌తో పోరాడ‌తార‌ని కాద‌ని, చేతిలో కర్ర ఉంటే ఏ జంతువైనా వెనకాడుతుందని శాస్త్రీయ పరిశీలన ద్వారా రుజువైందని చెప్పారు. వేల సంవత్సరాల నుంచి గ్రామాల్లో ప్ర‌జ‌లు పొలాలకు, అడవులకు వెళ్లేటప్పుడు చేతికర్రలను ఆస‌రాగా తీసుకెళ్లడం జరుగుతోందన్నారు. యాత్రికులకు చేతి కర్రను ఇచ్చి టీటీడీ బాధ్య‌త తీరిన‌ట్టు భావించ‌డం లేద‌ని, భ‌క్తుల‌కు గుంపులుగా పంపుతున్నామ‌ని, వీరికి సెక్యూరిటీ గార్డు భ‌ద్ర‌త‌గా ఉంటార‌ని, అక్కడక్కడ పోలీసు సిబ్బంది కూడా రక్షణగా ఉంటారని తెలియజేశారు. టీటీడీ చేపట్టిన చర్యల్లో భాగంగా అటవీ ప్రాంతంలో బోనులు ఏర్పాటుచేసి ఇప్పటివరకు నాలుగు చిరుతలను బంధించామ‌ని తెలియజేశారు. కర్రల పంపిణీకి సంబంధించి విమర్శలు చేస్తున్న వారిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. చేతిక‌ర్ర‌ల‌ను భ‌క్తుల‌కు ఉచితంగా అందిస్తామ‌ని, వీటిని అలిపిరిలో అంద‌జేసి శ్రీ న‌ర‌సింహ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద తిరిగి తీసుకుంటామ‌ని తెలిపారు.

టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ జులై 2న ఏడో మైలు వ‌ద్ద, ఆగస్టు 12న న‌ర‌సింహ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద జ‌రిగిన ఘటనల నేపథ్యంలో నడక మార్గంలో భక్తుల భద్రత దృష్ట్యా అనేక చర్యలు చేపట్టామన్నారు. 500 కెమెరా ట్రాప్‌లు ఏర్పాటుచేసి నిత్యం అడ‌వి జంతువుల సంచారాన్ని గుర్తించి వాటిని బందిస్తున్నామ‌ని, న‌డ‌క మార్గం వైపు రాకుండా తగిన చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు. భ‌క్తులు సాధు జంతువులు ఆహారం వేయ‌కుండా పండ్ల విక్ర‌యాల‌ను నిలిపివేశామ‌ని, ఈ కార‌ణంగా సాధు జంతువుల కోసం క్రూర‌మృగాలు రావ‌డం లేద‌ని వివ‌రించారు. ప్రస్తుతం తిరుమల శిలాతోరణం వద్ద, ఏడో మైలు వద్ద చిరుతల సంచారాన్ని గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో గాలిగోపురం నుండి వంద మంది భక్తులను గుంపులుగా గోవింద నామస్మరణ చేసుకుంటూ వెళ్లాలని సూచిస్తున్నామని, ప్రతి ఐదు నిమిషాలకోసారి బ్రాడ్ కాస్టింగ్ ద్వారా అటవీ జంతువుల సంచారం, జాగ్రత్తల నుంచి గురించి సమాచారాన్ని తెలియజేస్తున్నామని వివ‌రించారు. భక్తుల భద్రత కోసం అటవీశాఖ ప్రత్యేకంగా వందమంది సిబ్బందిని నియమించుకుంద‌ని, వారు కూడా విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు.

ప్రస్తుతం 12 ఏళ్ల లోపు పిల్లలను మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్ర‌మే అనుమతిస్తున్నామని, ఘాట్ రోడ్ల‌లో ఉద‌యం 6 నుండి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే ద్విచ‌క్ర వాహ‌నాల‌ను అనుమ‌తిస్తున్నామ‌ని ఈవో తెలియజేశారు. అలిపిరి నడక మార్గం రిజర్వ్ ఫారెస్ట్ లో ఉందని, ఇక్కడ ఇనుప కంచె వేయడానికి కేంద్ర అటవీ శాఖకు, వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ప్రతిపాదనలు పంపామని, వారు త‌గిన డిజైన్ల‌తో అంగీకారం తెలిపితే కంచె నిర్మిస్తామని తెలిపారు. చేతిక‌ర్ర‌ల కోసం అడ‌విని నాశనం చేయడం లేదని, పది వేల కర్రలు మాత్రమే తీసుకున్నామని, ఇందుకోసం రూ.45 వేలు ఖర్చు అయిందని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ‌కిషోర్‌, ఎస్వీబీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, ఎస్ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, టీటీడీ డిఎఫ్‌వో శ్రీ శ్రీ‌నివాస్‌, తిరుప‌తి డిఎఫ్‌వో శ్రీ స‌తీష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.