HANUMAN JAYANTHI CELEBRATED GRANDLY IN TTD LOCAL TEMPLES _ స్థానిక ఆలయాల్లో ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు
Tirupati, May 12, 2026: Devotees participated in Hanuman Jayanthi celebrations with devotion and chants of Lord Rama’s name at various TTD local temples on Tuesday.
The festivities were held grandly at Sri Kodandarama Swamy Temple and Sri Govindaraja Swamy Temple in Tirupati, Sri Prasanna Venkateswara Swamy Temple at Appalayagunta, Sri Kodandarama Swamy Temple at Vontimitta and other affiliated temples of TTD.
Special pujas, abhishekams and Vahana Sevas were conducted on the occasion. At Tirupati Sri Kodandarama Swamy Temple, special abhishekam was performed to Sri Anjaneya Swamy and Sri Sita Rama Lakshmana Utsava deities, followed by Hanumantha Vahana Seva in the evening.
Similar special rituals and abhishekams were also held at Govindaraja Swamy Temple, Appalayagunta and Ontimitta temples amid devotional fervour.
Temple officials, priests and a large number of devotees participated in the celebrations.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
స్థానిక ఆలయాల్లో ఘనంగా హనుమజ్జయంతి వేడుకలు
రామనామ స్మరణ, భక్తిశ్రద్ధలతో ఆంజనేయస్వామిని దర్శించుకున్న భక్తులు
తిరుపతి, 2026 మే 12: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయాలతో పాటు టీటీడీకి చెందిన ఇతర అనుబంధ ఆలయాల్లో మంగళవారం హనుమజ్జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
శరణాగత భక్తికి, అచంచల శ్రీరామ సేవకు ప్రతీకగా నిలిచిన శ్రీ ఆంజనేయస్వామివారి జయంతిని టీటీడీ ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, వాహనసేవలు జరిగాయి.
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో…
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో మంగళవారం హనుమజ్జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు.
ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ ఆంజనేయస్వామివారి మూలవర్లకు, శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవర్లకు విశేష అభిషేకం జరిగింది. రాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకు హనుమంత వాహనసేవ నిర్వహించనున్నారు.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో…
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఎదురు ఆంజనేయస్వామివారి ఆలయంలో ఉదయం 8 గంటల నుండి 8.30 గంటల వరకు శ్రీ ఆంజనేయస్వామివారి మూలవర్లకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో…
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో ఉదయం 8.30 గంటల నుండి 9.30 గంటల వరకు శ్రీ ఆంజనేయస్వామివారి మూలవర్లకు అభిషేకం జరిగింది.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో…
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో హనుమజ్జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ సంజీవరాయస్వామివారి మూలవర్లకు, శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవర్లకు విశేష అభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆయా ఆలయాల అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది





