HANUMAN JAYANTHI CELEBRATIONS IN TTD LOCAL TEMPLES ON MAY 12 _ మే 12న టీటీడీ స్థానిక ఆలయాల్లో వైభవంగా హనుమజ్జయంతి వేడుకలు
Tirupati, May 11, 2026: TTD will celebrate Hanuman Jayanthi grandly on May 12 in local temples including Sri Kodandarama Swamy Temple, Sri Govindaraja Swamy Temple, Sri Prasanna Venkateswara Swamy Temple and Sri Kodandarama Swamy Temple along with other affiliated temples.
Special pujas, abhishekams and Hanumantha Vahana Sevas will be conducted on the occasion.
At Tirupati and Ontimitta Sri Kodandarama Swamy temples, special abhishekams will be held from 7 am to 9 am, followed by Hanumantha Vahana Seva from 7 pm to 8.30 pm.
Special abhishekams will also be performed at Edduru Anjaneya Swamy Temple near Sri Govindaraja Swamy Temple and at Appalayagunta temple.
TTD appealed to devotees to participate in large numbers and seek the blessings of Sri Anjaneya Swamy.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మే 12న టీటీడీ స్థానిక ఆలయాల్లో వైభవంగా హనుమజ్జయంతి వేడుకలు
ప్రత్యేక అభిషేకాలు – భక్తిశ్రద్ధలతో హనుమంత వాహనసేవలు
తిరుపతి, 2026 మే 11: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయాలతో పాటు టీటీడీకి చెందిన ఇతర అనుబంధ ఆలయాల్లో మే 12న హనుమజ్జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.
శరణాగత భక్తికి, అచంచల శ్రీరామ సేవకు ప్రతీకగా నిలిచిన శ్రీ ఆంజనేయస్వామివారి జయంతిని టీటీడీ ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, వాహనసేవలు నిర్వహించనున్నారు.
తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో…
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో మంగళవారం హనుమజ్జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నారు.
ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ ఆంజనేయస్వామివారి మూలవర్లకు, శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవర్లకు విశేష అభిషేకం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుండి 8.30 గంటల వరకు హనుమంత వాహనసేవ భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తనుంది.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో…
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఎదురు ఆంజనేయస్వామివారి ఆలయంలో ఉదయం 8 గంటల నుండి 8.30 గంటల వరకు శ్రీ ఆంజనేయస్వామివారి మూలవర్లకు ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు.
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో…
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో ఉదయం 8.30 గంటల నుండి 9.30 గంటల వరకు శ్రీ ఆంజనేయస్వామివారి మూలవర్లకు అభిషేకం నిర్వహించనున్నారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో…
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో హనుమజ్జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ సంజీవరాయస్వామివారి మూలవర్లకు, శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవర్లకు విశేష అభిషేకం నిర్వహిస్తారు.
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ కోరింది.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది
