HANUMAN JAYANTHI UTSAVAMS CONCLUDES _ ముగిసిన హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాలు

Tirumala, 8 Jun. 21: The maiden five day Hanuman Jayanthi Utsavams mulled by TTD at the birthplace of Anjaneya at Anjanadri Hills in Tirumala near Akasa Ganga concluded on Tuesday.

Speaking on the occasion Additional EO of TTD Sri AV Dharma Reddy said, the first-ever five day Hanuman Jayanthi fete concluded with special Abhishekam and Archana to Anjana Devi and Bala Anjaneya Swamy idols consecrated in the newly constructed temple at Anjanadri.

He said with the blessings of Anjaneya the entire humanity will soon overcome from the ill effects of Covid.

Special Pujas were also rendered to the idols of Sri Sita Lakshmana Anjaneya Sametha Sri Rama idols and also Sri Sudarshana Chakrattalwar on the occasion.

Chief Priest Sri Venugopala Deekshitulu, DyEO Sri Harindranath, Peishkar Sri Srihari, Agama Advisor Sri Mohana Rangacharyulu, Veda Pundits were also present.

Later Sri Rajamohan team rendered melodious Sankeertans at Anjanadri while at Japali Sri PS Ranganath team rendered Hanuman Chalisa and Sri Chandrasekhar presented Harikatha.

HANUMAN AND HIS WORK EFFICIENCY

As a part of Hanumad Vaibhavam lectures in Nada Neerajanam Platform at Tirumala National Sanskrit Varsity scholar Sri Venkatacharyulu spoke on Hanuman and His work efficiency on Tuesday.

He said every phase in the life of Hanuman shows his calibre. Hanuman is an iconic role model especially to youth as he efficiently took forward the tasks given to him by His Master.

The youth of today should learn the qualities of Discipline, Physical and Mental Fitness, Communication Skills, Work Efficiency, Time Sense and above all Loyalty towards Master from the life of Anjaneya, he affirmed.

The special lectures designed for five day Hanuman Jayanthi fete concluded on Tuesday.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆంజ‌నేయస్వామి జ‌న్మ‌స్థ‌లం అభివృద్ధికి కృషి : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

ముగిసిన హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాలు

తిరుమల, 2021 జూన్ 08: తిరుమ‌ల‌లో ఆంజ‌నేయ‌స్వామి జ‌న్మ‌స్థ‌లాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామ‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమల‌లో 5 రోజుల పాటు జ‌రిగిన హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాలు మంగ‌ళ‌వారం ముగిశాయి. చివ‌రి రోజున ఆకాశగంగ వ‌ద్ద జ‌రిగిన పూజా కార్య‌క్ర‌మాల్లో అద‌న‌పు ఈవో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మీడియాతో మాట్లాడుతూ హ‌నుమ‌జ్జ‌యంతి సంద‌ర్భంగా ఆంజనేయుడు జ‌న్మించిన స్థ‌లంలో 5 రోజుల పాటు విశేష ఉత్స‌వాలు నిర్వ‌హించిన‌ట్టు చెప్పారు. ఇందులోభాగంగా ప్ర‌తిరోజూ ఉద‌యం శ్రీ అంజ‌నాదేవికి, శ్రీ బాలాంజ‌నేయ‌స్వామివారికి అభిషేకం, అర్చ‌న‌, ఇత‌ర పూజలతోపాటు నివేద‌న‌లు స‌మ‌ర్పించామ‌న్నారు.

అనంత‌రం శ్రీ ఎ.రాజ‌మోహ‌న్‌ బృందం హ‌నుమ‌త్ సంకీర్త‌న వైభ‌వం సంగీత కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, పేష్కార్లు శ్రీ శ్రీ‌హ‌రి, శ్రీ శ్రీ‌నివాసులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

జాపాలి క్షేత్రంలో…

జాపాలి క్షేత్రంలో అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీ పిఎస్‌.రంగ‌నాథ్ బృందం హ‌నుమాన్ చాలిసా పారాయ‌ణం చేశారు. శ్రీ చంద్ర‌శేఖ‌ర్ హ‌రిక‌థ వినిపించారు.

యువతకు హనుమంతుడు ఆదర్శం

ఉన్న‌త‌మైన ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు పాటుప‌డే యువ‌త‌కు హ‌నుమంతుడు ఆద‌ర్శ‌నీయుల‌ని తిరుప‌తిలోని జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం గెస్ట్ లెక్చ‌ర‌ర్ శ్రీ వెంక‌టాచార్యులు పేర్కొన్నారు. తిరుమ‌ల‌లో జ‌రుగుతున్న హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాల చివ‌రి రోజైన మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నాద‌నీరాజ‌నం వేదిక‌పై ” హ‌నుమంతుని కార్య‌ద‌క్ష‌త‌ ” అనే అంశంపై ప్ర‌వ‌చన‌ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా శ్రీ వెంక‌టాచార్యులు ఉప‌న్య‌సిస్తూ హ‌నుమంతుని కార్యదక్షత ఉత్కృష్టమైంద‌ని, కాబట్టే ఆంజనేయస్వామి మహావిఘ్నాలను అధిగమించి అనితరసాధ్యమైన మహత్కార్యాన్ని సాధించగలిగార‌ని చెప్పారు. లంక‌లో సీత‌మ్మ జాడ‌ను తెలుసుకుని సీతారాముల‌ను క‌లిపి ఘ‌న‌కీర్తిని సొంతం చేసుకున్నార‌ని వివ‌రించారు. శ్రీరామసుగ్రీవులను కలిపే ఘట్టంలో బుద్ధిబలం, స్వామిభక్తి, అపారమైన జ్ఞానం, వాక్చాతుర్యం, భవిష్యత్తును అంచనావేసే శక్తిని ప్ర‌ద‌ర్శించార‌ని, సముద్రలంఘనం ఆరంభించే సమయంలో సంకల్పసిద్ధి, లక్ష్యశుద్ధి క‌నిపిస్తాయ‌ని తెలియ‌జేశారు. మైనాకుడు ఎదురైన ఘట్టంలో సంకల్పస్మరణం, ఇంద్రియనిగ్రహం, అవిశ్రాంతకృషి, సమయపాలన, సీతమ్మవారు అశోకవనంలో క‌నిపించిన సమయంలో అమోఘమైన వేగంతో తార్కికబుద్ధితో ఖచ్చితత్వంతో నిర్ణయాలు తీసుకున్నార‌ని చెప్పారు. ఇలాంటి ల‌క్ష‌ణాలు నేటి యువ‌త‌కు చాలా అవ‌స‌ర‌మ‌ని తెలియ‌జేశారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.