HANUMAN JAYANTI CELEBRATIONS AT TTD SRI ANJANEYA SWAMY TEMPLES ON MAY 22 _ మే 22న టిటిటి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలలో హనుమాన్ జయంతి వేడుకలు

Tirupati, 21 May 2025: The Hanuman Jayanti celebrations will be held with grandeur at the TTD run Sri Anjaneya Swamy Temples on Thursday. 

On the occasion of Sri Hanuman Jayanti, special poojas will be conducted at Eduru Anjaneya Swamy Temple (opposite GT Temple), Matam Anjaneya Swamy Temple (Gandhi Road), Abhaya Anjaneya Swamy Temple (Old Huzur Office area), Sri Bhakta Anjaneya Swamy Temple (Alipiri Sripadala Mandapam).

Other temples includes Sri Abhaya Hasta Anjaneya Swamy Temple (At Kapilatirtham Sri Kapileswara Swamy), Sri Sanjeevarayaswamy Temple, (opposite Vontimitta Sri Kodandaramaswamy Temple).

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

మే 22న టిటిటి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలలో హనుమాన్ జయంతి వేడుకలు

తిరుపతి, 2025, మే 21: టిటిడిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలలో గురువారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆయా ఆలయాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా ఎదురు ఆంజనేయ స్వామి ఆలయం, జీటీ ఆలయం ఎదురుగా, మఠం ఆంజనేయ స్వామి ఆలయం, గాంధీ రోడ్ , అభయ ఆంజనేయ స్వామి ఆలయం, ఓల్డ్ హుజూర్ ఆఫీస్ వద్ద, శ్రీ భక్త ఆంజనేయ స్వామివారి ఆలయం, అలిపిరి శ్రీపాదాల మండపం వద్ద. కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయం పరిధిలో శ్రీ అభయ హస్త ఆంజనేయ స్వామి వారి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంకు ఎదురుగా ఉన్న శ్రీ సంజీవరాయ స్వామి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.