HANUMANTA JAYANTI FROM MAY 25-29 _ మే 25 నుండి 29వ తేదీ వ‌ర‌కు హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాలు

Tirumala, 21 May 2022: TTD is set for organising Hanumanta Jayanti Mahotsavam from May 25 to 29 at Nada Neeranjanam, Anjanadri Anjaneya in Akashaganga, Japali and Dharmagiri in Tirumala.

At the Nada Neeranjanam Platform, spiritual discourses will be rendered by scholars every day between 3pm and 4pm. On May 25 Prof. Rani Sadasiva Murthy will deliver address on the topic, “Anjananandanam Veeram” while Dr Akella Vibhishana Sharma on “Sundare Sundaram Kapihi” on May 26. Dr M Pavana Kumara Sharma will render a spiritual talk on the theme of “Veera Hanuman Kapihi” on May 27, Prof. Rani Sadasiva Murthy will render religious discourse on “Gnaninamagraganyam” on May 28 and on the last day on May 29, Dr MG Nandana Rao will speak on “Rama Vaibhava Sphoorti”.

TTD is organizing Sri Hanumanta Avatara Pravachanas every day at Sri Balanjaneya Swami temple at Akashaganga. 

The artists of Annamacharya Project, Dasa Sahitya Project and SV College of Music and Dance will also perform Bhakti sangeet and cultural programs during the Mahotsavam at Akashaganga and Anjaneya Swami temple near Japali.

TTD is also organizing non-stop Sampoorna Sundarakanda Akhanda Parayanam at Dharmagiri Veda Vignana Peetham on May 29 from 6am to 10pm without interruption.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 25 నుండి 29వ తేదీ వ‌ర‌కు హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాలు
 
తిరుమ‌ల‌, 2022 మే 21: తిరుమ‌ల‌లో ఈ నెల 25 నుండి 29వ తేదీ వ‌ర‌కు హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాలు తిరుమ‌ల‌లోని నాద‌నీరాజ‌నం వేదిక‌, ఆకాశ‌గంగ‌, జ‌పాలి, ధ‌ర్మ‌గిరి ప్రాంతాల్లో ఘనంగా జ‌రుగ‌నున్నాయి.
 
నాద‌నీరాజ‌నం వేదిక‌పై మ‌ధ్యాహ్నం 3 నుండి 4 గంటల వ‌ర‌కు ఆధ్యాత్మిక ప్ర‌వ‌చ‌న కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది. ఇక్క‌డ మే 25న “అంజ‌నానంద‌నం వీరం” అనే అంశంపై ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, మే 26న “సుంద‌రే సుంద‌రః క‌పిః” అనే అంశంపై డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ‌, మే 27న “వీరో హ‌నుమాన్ క‌పిః” అనే అంశంపై డా. ఎం.ప‌వ‌న‌కుమార్ శ‌ర్మ‌, మే 28న “జ్ఞానినామగ్ర‌గ‌ణ్యం” అనే అంశంపై ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, మే 29న “రామ‌వైభ‌వ స్ఫూర్తి” అనే అంశంపై డా. ఎం.జి.నంద‌న‌రావు ఉప‌న్య‌సిస్తారు.
 
ఆకాశ‌గంగ వ‌ద్ద‌గ‌ల శ్రీ బాలాంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద ఉదయం 10 నుండి 11 గంటల వ‌ర‌కు  ప్ర‌ముఖ పండితులు శ్రీ హ‌నుమ అవ‌తార ఘ‌ట్ట ప్ర‌వ‌చ‌నాలు చేస్తారు. ఉద‌యం 11 గంట‌ల నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌రకు అన్న‌మాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య క‌ళాశాల ఆధ్వ‌ర్యంలో భ‌క్తిసంగీతం, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.
 
జ‌పాలి శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద ఉదయం 10 నుండి 12 గంట‌ల వ‌ర‌కు, తిరిగి మ‌ధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌రకు అన్న‌మాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య క‌ళాశాల ఆధ్వ‌ర్యంలో భ‌క్తిసంగీతం, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.
 
మే 29న ధ‌ర్మ‌గిరి వేద‌పాఠ‌శాల‌లో ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వలకు సంపూర్ణ సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం జ‌రుగనుంది.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.