HANUMANTA VAHANA SEVA HELD _ హనుమంత వాహనంపై విహరించిన శ్రీ సుందరరాజస్వామి వారు
TIRUPATI, 18 JUNE 2025: On the second day of Sri Sundara Raja Swamy Avatarotsavams at Tiruchanoor, Hanumanta Vahana Seva was observed in the evening of Wednesday.
On June 19, the three-day annual fete will conclude.
Temple DyEO Sri Harindranath and others were present.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
హనుమంత వాహనంపై విహరించిన శ్రీ సుందరరాజస్వామి వారు
తిరుపతి, 2025, జూన్ 18: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు రెండవ రోజు వైభవంగా సాగాయి.
ఉదయం 10 -11గం.ల మధ్య స్వామి వారికి కళ్యాణోత్సవం చేపట్టారు.
మధ్యాహ్నం 3 – 4 గం.ల మధ్య శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి వైభవంగా అభిషేకం చేశారు.
ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు.
సాయంత్రం 5.45 – 6.15 గం.ల మధ్య ఊంజల్ సేవ చేపట్టనున్నారు. రాత్రికి 7 – 8.30 గం.ల మధ్య హనుమంత వాహనంపై నాలుగు మాడ వీధుల్లో స్వామివారు విహరిస్తారు.
జూన్ 19న ముగింపు ఉత్సవాలు
జూన్ 19న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు ముగియనున్నాయి. రాత్రి 7 – 8.30 గం.ల మధ్య గరుడ వాహనంపై స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరింధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, ఆర్జితం ఇన్స్పెక్టర్ శ్రీ కె.చలపతి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.