HANUMANTA VAHANA SEVA HELD _ హనుమంత వాహనంపై శ్రీరామావతారం అలంకరణలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు

TIRUPATI, 12 JUNE 2025: Abhaya Hasta Sri Prasanna Venkateswara Swamy in Ramavatara blessed His devotees on Hanumanta Vahanam.

The ongoing annual brahmotsavams at Appalayagunta entered Sixth day on Thursday.

As a part of this nine-day festival, the processional deity of Sri Prasanna Venkateswara Swamy, decked as Sri Ramachandra Murty, proceeded along the streets surrounding the temple atop the divine and noble Hanumanta Vahanam.

Temple DyEO Sri Harindranath, AEO Sri Devarajulu, Superintendent Smt Srivani, Temple Inspector Sri Siva Kumar, Archakas, devotees, sevaks and others were also present.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

హనుమంత వాహనంపై శ్రీరామావతారం అలంకరణలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు

తిరుపతి/ అప్పలాయగుంట, 2025, జూన్ 12: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 8.00 గం.లకు లకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారు హనుమంత వాహనంపై శ్రీ రామావతారం అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి భక్తులను అనుగ్రహించారు.

ఉదయం 08.00 గంటలకు హనుమంత వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 3.00 – 4.00 గం.ల మధ్య పుణ్యహం, వసంతోత్సవం నిర్వహించారు.

రాత్రి 7.00 గం.లకు గజ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి భక్తులను అనుగ్రహించనున్నారు.

వాహన సేవలో టిటిడి డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్‌ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.