HANUMANTHA VAHANA SEVA OBSERVED _ హనుమంత వాహనంపై కళ్యాణ రాముడు

Tirupati, 25 Feb. 22: Hanumantha vahana Seva took place in Ekantam at Srinivasa Mangapuram on Friday morning.

As a part of ongoing annual brahmotsavams in Sri Kalyana Venkateswara Swamy Temple, lord as Kodanda Rama blessed devotees on Hanumantha vahanam.

In the evening between 3 p.m. and 4 p.m., vasanthotsavam will be performed in Kalyana mandapam.

Temple DyEO Smt Shanti, AEO Sri Gurumurthy and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

హనుమంత వాహనంపై కళ్యాణ రాముడు

తిరుపతి, 2022 ఫిబ్ర‌వ‌రి 25: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ కోదండరామస్వామివారి అలంకారంలో హనుమంత వాహనంపై దర్శనమిచ్చారు. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు వాహనసేవ ఆల‌యంలో ఏకాంతంగా జరిగింది

భ‌గ‌వ‌త్ భ‌క్తి ప్రాప్తి :

బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు ఉదయం స్వామివారు ధనుర్బాణాలు దాల్చి కల్యాణ వేంకటరాముడై హనుమంతునిపై ఆసీనుడై భక్తులను అనుగ్రహించారు. శ్రీవారు త్రేతాయుగంలో శ్రీరాముడై అవతరించాడు. శ్రీరాముడు హనుమంతుని భుజస్కంధాలపై అధిరోహించిన సన్నివేశాలు శ్రీమద్రామాయణంలో ఉన్నాయి. ఈ ఉత్సవంలో వాహనంగా హనుమంతుడిని, వాహనాన్ని అధిష్టించిన కల్యాణ వేంకటరాముడిని దర్శించడం వల్ల భోగమోక్షాలు, జ్ఞానవిజ్ఞానాలు, అభయారోగ్యాలు కలుగుతాయి.

కాగా మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు శ్రీవారి కల్యాణమండపంలో వసంతోత్సవం ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్లు శ్రీ చెంగ‌ల్రాయులు, శ్రీ రమణయ్య, ఆలయ అర్చకులు బాలాజి రంగ‌చార్యులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.