HANUMANTHA VAHANAM SEVA HELD _ హనుమంత వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల విహారం

Vontimitta /Tirumala, 09 April 2025: The annual Brahmotsavams at Vontimitta in Kadapa district witnessed the most important among all vahana sevas, the Hanumanta Vahana Seva on Wednesday evening.

Hanuman, embodiment of strength and loyalty towards His master is equally considered and worshipped as Almighty and among all the carriers, He alone holds the place of worship in the hearts of His devotees.

Temple officials and devotees were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

హనుమంత వాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల విహారం

ఒంటిమిట్ట / తిరుపతి 2025 ఏప్రిల్ 09: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం రాత్రి విశేషమైన హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది.

శ్రీ సీతారామలక్ష్మణులు ప్రియభక్తుడైన హనుమంత వాహనాన్ని అధిరోహించి పురవీధుల్లో భక్తులకు ద‌ర్శ‌న‌మిచ్చారు. రాత్రి 7 గంటల నుండి కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి దర్శించుకున్నారు.

త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వారు హనుమంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం ద్వారా తెలుస్తోంది. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నారు. దాసభక్తికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతున్నారు.

వాహన సేవలో డెప్యూటీ ఈఓ శ్రీ నటేష్ బాబు, సూపరింటెండెంట్
శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.