HDPP HOLDS KAVI SAMMELANAM _ రామ‌నామ స్మ‌ర‌ణ‌తో స‌క‌ల శుభాలు : శ్రీ జగన్నాథ శాస్త్రి

Vontimitta/Tirumala, 07 April 2025: Srimadramayana Parayanam is a way to salvation advocated Sri Jagannatha Shastry.

The scholar delivered lecture on Ayodhya Kanda in an impressive manner.

Another scholar Sri Ramchakradhar described the poems from Sundarakanda in a soul touching manner.

Prof. Ramprasad Reddy spoke on Balakanda while Prof. Mallikharjuna on Kishkinda Kanda, Smt Lakshmi on Yuddha Kanda and Sri Madugula Shiva Sharma on Uttara Kanda which impressed devotees to a great extent.

HDPP chief Sri Sriram Raghunath, AEO Sri Sriramulu and others participated.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

రామ‌నామ స్మ‌ర‌ణ‌తో స‌క‌ల శుభాలు : శ్రీ జగన్నాథ శాస్త్రి

ఒంటిమిట్ట, 2025 ఏప్రిల్ 07: రామ‌నామ స్మ‌ర‌ణ‌తో స‌క‌ల శుభాలు, విజ‌యం, ఆరోగ్యం, ఐశ్వ‌ర్యం స‌మ‌కూరుతాయ‌ని కడపకు చెందిన శ్రీ జగన్నాథ శాస్త్రి పేర్కొన్నారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనం సోమవారం సాయంత్రం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా శ్రీ జగన్నాథ శాస్త్రి “అయోధ్యకాండ” పై మాట్లాడుతూ, శ్రీ‌మ‌ద్రామాయ‌ణ పారాయ‌ణం ఒక జ్ఞాన‌య‌జ్ఞమ‌న్నారు. వేద‌స్వ‌రూప‌మైన రామాయ‌ణ పారాయ‌ణం ద్వారా భ‌క్తి, జ్ఞానం, వైరాగ్యం, చిత్త‌శుద్ధి క‌లుగుతాయ‌ని, వీటి ద్వారా మోక్షం ల‌భిస్తుంద‌ని చెప్పారు.

సీతా ల‌క్ష్మ‌ణ స‌మేత శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి అర‌ణ్యంలో సంచ‌రించేట‌ప్పుడు పితృవాక్యా ప‌రిపాల‌న‌, సీత‌మ్మ‌వారు ప‌తివ్ర‌త ధ‌ర్మం, ల‌క్ష్మ‌ణ స్వామివారు సోద‌ర ధ‌ర్మం వంటి అనేక ధ‌ర్మాల‌ను తెలియ‌జేస్తుంది. కావున‌ అయోధ్య‌కాండను ధ‌ర్మ‌కాండ అని అంటార‌న్నారు. రామాయ‌ణంలోని అయోధ్య‌కాండ పారాయ‌ణం చేసినా, విన్నా ప్ర‌తి ఒక్క‌రికి మోక్ష, ధ‌న ప్రాప్తి క‌లుగుతుంద‌ని చెప్పారు. ఇందులో శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి అంద‌రికి ధ‌నం, ధాన్యం, గోవులు, ఏనుగులు త‌దిత‌ర వాటిని దానం చేసిన‌ట్లు తెలిపారు.

శ్రీ రామ్ చక్రధర్ “సుందర కాండ” అనే అంశంపై ప్రసంగిస్తూ, సుంద‌ర‌కాండ‌లో హ‌నుమంతుని ప్ర‌వేశం నుండి యుద్ధ కాండ చివ‌రి వ‌ర‌కు అష్ట‌సిద్ధుల వ‌ల‌న ఆయ‌న లోకానికి అద్భుతాల‌ను చూపించి రామాయ‌ణాన్ని ఒక సుంద‌ర‌ ఇతి హ‌సంగా మ‌ల‌చ‌డానికి కార‌ణం అయ్యార‌న్నారు.

ఆచార్య రాంప్రసాద్ రెడ్డి “బాలకాండ” అనే అంశంపై మాట్లాడుతూ, శ్రీరాముడి బాల్య విశేషాలు, రాక్ష‌స సంహారం, శివ‌ధ‌న‌స్సు విరిచి సీతాదేవిని క‌ల్యాణం చేసుకోవ‌డం త‌దిత‌ర అంశాలు ఉన్నాయ‌న్నారు. భ‌క్తులు ఈ శ్లోకాల‌ను ప‌ఠించిన‌, శ్ర‌వ‌ణం చేసినా సంపూర్ణ ఆరోగ్యం శిద్ధిస్తుంద‌న్నారు.

అనంతరం ఆచార్య మల్లికార్జున రెడ్డి “కిష్కిందకాండ” శ్రీమతి లక్ష్మి “అరణ్యకాండ” శ్రీ మధుసూదన్ “యుద్ధకాండ”మాడుగుల శివ శ్రీ శర్మ”ఉత్తరాఖండ”లపై ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో డిపిపి కార్యదర్శి శ్రీ రఘునాథ్ ఏఈఓ శ్రీ శ్రీరాములు ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.