HELMET DISTRIBUTED TO TTD EMPLOYEES _ ఉద్యోగులకు హెల్మెట్ల పంపిణీ

Tirumala, 10 May 2025: TTD Chairman Sri B.R. Naidu distributed helmets among the TTD employees on Saturday morning at his camp office in Tirumala. 

To ensure the safety of employees commuting between Tirumala and Tirupati, the TTD Trust Board Chief mulled this initiative.

Speaking to the media, the Chairman stated that the decision to distribute helmets was taken as a part of ensuring safety of TTD employees. 

He said that Sri Jaladi Raghuram from Guntur and Mr. Naveen, head of KCN Helmets from Delhi, have come forward to donate helmets for the cause.

As part of it, in the first phase, 555 helmets worth approximately Rs.5 lakh were donated. An additional 500 helmets are expected to be donated within 15 days. 

”If these are found satisfactory in quality and usage, another 5,000 helmets will be provided.

TTD Board Members Sri Shanta Ram, VGOs Sri Ram Kumar, Sri Surendra, and other officials participated in the program.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

ఉద్యోగులకు హెల్మెట్ల పంపిణీ

తిరుమల, 2025 మే 10: టీటీడీ ఉద్యోగులకు టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు శనివారం ఉదయం తిరుమలలోని ఆయన క్యాంపు కార్యాలయంలో హెల్మెట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ తిరుమల నుండి తిరుపతికి వచ్చే టీటీడీ ఉద్యోగులకు ప్రయాణ సమయంలో భద్రత కల్పించడంలో భాగంగా హెల్మెట్లు పంపిణీ చేయాలని నిర్ణయించామని అన్నారు. ఉద్యోగులకు హెల్మెట్లు పంపిణీ చేసేందుకు గుంటూరుకు చెందిన శ్రీ జలాది రఘురామ్, ఢిల్లీకి చెందిన కేసీఎన్ హెల్మెట్ల తయారీ సంస్థ అధినేత శ్రీ నవీన్ ముందుకు వచ్చారని తెలిపారు.

ఇందులో భాగంగా మొదటి విడతగా సుమారు రూ.5 లక్షలు విలువైన 555 హెల్మెట్లు విరాళంగా ఇచ్చారని చెప్పారు. 15 రోజుల్లో మరో 500 హెల్మెట్లు విరాళంగా ఇస్తారని చెప్పారు. వీటిని పరిశీలించి బాగున్నాయని తెలిపితే మరో ఐదు వేల హెల్మెట్లు అందిస్తారని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ శాంతా రామ్, వీజీవోలు శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.