HIGHLIGHTS OF DIAL YOUR EO PROGRAM_ ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం-డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి

Tirumala, 4 June, 2023: TTD EO Sri AV Dharma Reddy addressed the devotees from Annamaiah Bhavan on Sunday as part of Dial-Your EO program and answered their queries and heard their suggestions.

 

Following are excerpts from the media conference held later.

 

SUMMER ARRANGEMENTS AT TIRUMALA

– All TTD departments coordinating efforts to ensure that devotees coming for srivari Darshan are not inconvenienced in any manner.

– In this direction TTD has limited the VIP breaks Fri-Sun to only protocol VIPs till July 15 and also cancelled the discretionary quota of Suprabatha Seva in order to provide Srivari Darshan to more and more common devotees.

– TTD staff in coordination with Srivari Sevakulu and all departments are rendering efficient services to devotees.

– During heavy crowds it takes 2 days for srivari Darshan for devotees who come without tokens .I appeal to devotees to be patient in such circumstances.

JYESTABHISHEKAM AT SRIVARI TEMPLE

– The Jyestabhisekam festival conducted at Srivari temple from June 2 concludes on Sunday.

  

REVIEW ON SECURITY AT TIRUMALA

 

– A two day review on security arrangements were held by AP Home Secretary Sri Harish Kumar Gupta recently. On the lines suggested by him TTD is prioritising the security arrangements at Tirumala.

 

SUNDARA TIRUMALA- SHUDDHA TIRUMALA

 

– All TTD officials, employees and Srivari Sevakulu participated voluntarily in the month long Sundara Tirumala- Shuddha Tirumala program and made it a success,

– During the month 15,441 regular employees,13351 corporation employees,6000 Srivari Sevakulu and officials of the Municipal Corporation,collectorate,police and courts volunteered in the cleaning program in various locations of Tirumala including two ghat roads, both footpaths etc.

– On May 31 former CJI of Supreme Court Sri NV Ramana also participated in the massive program to remove plastic wastes in Tirumala and I personally thank him.

 

ACTION PLAN TO MAKE GHAT ROADS AS ACCIDENTS FREE

– Some accidents occurred on ghat roads recently due to drivers neglect and bad vehicle conditions.

– Now TTD has prepared a long standing action plan to avoid accidents. We appeal all drivers of taxis and private vehicles to travel only at the speed levels prescribed by the TTD.we advice drivers to avoid phone talking or overtaking at turnings and speeding during the drive to Tirumala.

SVBC

– Devotees from all over India and overseas participated in the Parayanams telecast by SVBC onMay16  at the Dharmagiri Veda Pathashala .In four teams Veda pundits chanted 2808 shlokas of Sundarakanda akhanda Parayanams.

– Similarly Ayodhyakanda Parayanams is continuing at Nada Niranjanam from May 17 onwards.

VEDIC HERITAGE CORRIDOR

– With objective to impart ancient knowledge to future generations TTD has set up the Vedic Heritage corridor at the SVV university on 190 aspects of knowledge embedded in Vedas like space science, management strategy, mathematics, health management, Yoga and Diet etc. .

– The SVBC plans to telecast a ten minutes episode each on Ancient Indian knowledge treasure for updating on, social media as well for adaptation in the modern lifestyles of devotees.

– The picture gallery at the corridor is, open during working hours for all devotees to gain insights.

 

BHUMI POOJA FOR SV TEMPLE AT MUMBAI ON JUNE 7

– Maharashtra government allocated 10 acres in NAVI Mumbai to TTD for construction of SV temple .Sri Gautam Singhania,of Raymond Company has come forward to donate ₹100 crore for construction of the temple .

– Arrangements are being done to conduct bhumi puja on June 7.

– Maharashtra CM Sri Eknath Shinde, Deputy CM Sri Devendra Phadnavis and other prominent devotees will participate.

– Similarly TTD conducted bhumi puja for construction of SV temple at Chintakunta in Kothapalli mandal of Karimnagar district on May 31 last.

 

MAHA SAMPROKSHANA FETE AT SV TEMPLE IN JAMMU

– As part its campaign to propagate Sanatana Hindu Dharma, TTD is building SV temples in all prominent towns and cities of the country.

– TTD is performing a grand Maha Samprokshana festival from June  3-8 at Majin  village of Jammu state in the 60 acres of land granted by J&K government at a cost of ₹30 crore .

– Recently the Maha Samprokshana fete was performed for SV temples built in Seethampeta in Rampachodavaram.

 

SUCCESSFUL MEDICAL SERVICES

-: On a single day six cochlear implants and cleft palate operations were performed at the BIRRD hospital by prominent doctors.

-Similarly over 50 hunch -back operations were performed at the BIRRD hospital this year.

RECORD 1450 HEART OPERATIONS AT SRI PADMAVATHI HRUDAYALA

 

– At the Sri Padmavati Hrudayalaya a record heart operations were performed for 1450 children including those from other states freely under the Arogyasree and Ayushmann Bharat scheme with support from Pranadan scheme.

BEWARE OF FAKE EMPLOYMENT ADS

-: TTD has cautioned that some vested interested persons were cheating unemployed youth with fake advertising through social media of providing jobs in TTD.

– The IT department of TTD has already filed several police complaints about such fake ads and social media which publicised them.

– TTD appealed to unemployed persons to be not carried away by such ad

 

Details of May 2023 achievements

– Srivari Darshan: 23.38 lakh devotees

– Hundi collection: ₹ 109.99 crores

– Srivari Laddus sold: 1crore and six lakhs

– Anna Prasadam: 56.30 lakhs

– Kalyana Katta: 11 lakhs

 

TTD JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVS Sri Narasimha Kishore, CE Sri Nageswar Rao and others were present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం

– టీటీడీ చరిత్రలో తొలిసారి అధికారులు, ఉద్యోగులతో సుందర తిరుమల-శుద్ధ తిరుమల

డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి

తిరుమల, 4జూన్ 2023: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల భద్రత కోసం ఘాట్ రోడ్ల ప్రయాణం లో ప్రమాదాల నివారణకు దీర్ఘ కాలిక ప్రణాళికలు సిద్ధం చేశామని టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి చెప్పారు. టీటీడీ చరిత్రలో తొలిసారిగా అధికారులు, ఉద్యోగులందరు సుందర తిరుమల -శుద్ధ తిరుమల పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారని చెప్పారు.
తిరుమల అన్నమయ్య భవన్ ఆదివారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులతో మాట్లాడారు. ఆ వివరాలు ఇవి.

తిరుమలలో వేసవి ఏర్పాట్లు :

– వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ లోని అన్ని విభాగాలు సమన్వయంతో సేవలందిస్తున్నాయి.

– ఇందుకోసం జూలై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో విఐపి బ్రేక్‌ దర్శనాలను ప్రొటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశాం. సుప్రభాత సేవ విచక్షణ కోటా రద్దు చేశాం. తద్వారా ఎక్కువ మంది సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకోగలుగుతున్నారు.

– టీటీడీ సిబ్బందితోపాటు శ్రీవారి సేవకులు, ఇతర విభాగాల సిబ్బంది సమన్వయంతో పనిచేసి భక్తులకు చక్కటి సేవలు అందిస్తున్నారు.

– తిరుమలలో ఎక్కువ రద్దీ ఉన్న సమయంలో టోకెన్‌ లేకుండా దర్శనానికి వచ్చిన భక్తులు శ్రీవారి దర్శనం కోసం దాదాపు 2 రోజుల పాటు వేచి ఉండాల్సి వస్తుంది. అటువంటి సమయంలో భక్తులు ఓపికతో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్టాభిషేకం :

– జూన్‌ 2వ తేదీ నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహిస్తున్న జ్యేష్టాభిషేకం ఈరోజుతో ముగుస్తుంది.

తిరుమల భద్రతపై సమీక్ష :

– తిరుమల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ హరీష్‌ కుమార్‌ గుప్తా ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారులు తిరుమలలో రెండు రోజులపాటు భద్రతాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహించారు. తద్వారా భక్తుల భద్రతకు పెద్దపీట వేస్తున్నాము.

సుందర తిరుమల-శుద్ధ తిరుమల

– టీటీడీ చరిత్రలో తొలిసారి టీటీడీ లోని అన్ని విభాగాల ఆధికారులు, ఉద్యోగులు, శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా నెల రోజుల పాటు సుందర తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమంలో పాల్గొన్నారు.

– నెల రోజుల్లో 15,441 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు, 13,351 మంది కార్పొరేషన్‌ సిబ్బంది, 6 వేల మందికి పైగా శ్రీవారి సేవకులు, తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌, కలెక్టరేట్‌, పోలీస్‌, న్యాయశాఖ అధికారులు తిరుమలలోని పలు ప్రాంతాలు, రెండు ఘాట్‌ రోడ్లు, రెండు నడక దార్లలో పారిశుద్ధ్య విధుల్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు.

– మే 13వ తేదీన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి.రమణగారు సైతం తిరుమల క్షేత్రంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించే బృహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారు. వారికి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఘాట్‌ రోడ్లలో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళిక

– తిరుమల ఘాట్‌రోడ్లలో ఇటీవల డ్రైవర్ల నిర్లక్ష్యం, వాహనాల కండీషన్‌ బాగా లేనందు వల్ల కొన్ని ప్రమాదాలు జరిగాయి. ప్రమాదాల నివారణకు జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేశాము. ట్యాక్సీ డ్రైవర్లు , వాహనదార్లు డ్రైవింగ్‌ చేసే సమయంలో టీటీడీ నిర్ణయించిన వేగం మేరకే నిదానంగా ప్రయాణించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. డ్రైవింగ్‌ సమయంలో సెల్‌ ఫోన్‌ మాట్లాడకుండా, మలుపుల వద్ద పరిమిత వేగంతో , ఓవర్‌ టేక్‌ చేయకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నాను.

ఎస్వీబిసి

– తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో మే 16న సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం జరిగింది. నాలుగు బృందాల్లో వేద పండితులు మొత్తం 2,808 శ్లోకాలను దాదాపు 16 గంటల పాటు నిర్విరామంగా పారాయణం చేశారు. దేశం నలుమూలలతోపాటు విదేశాల నుండి భక్తులు ఈ కార్యక్రమంలో ఎస్వీబిసి ద్వారా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

– తిరుమల నాదనీరాజనం వేదికపై మే 17వ తేదీ నుండి అయోధ్యకాండ పారాయణం ప్రారంభమై కొనసాగుతోంది.

వేదిక్‌ హెరిటేజ్‌ కారిడార్‌

– వేదాల్లోని అంతరిక్ష విజ్ఞానం, యాజమాన్య నిర్వహణ, గణితం, ఆరోగ్య సంరక్షణ, యోగ, ఆహారం తీసుకోవాల్సిన విధానం లాంటి దాదాపు 190 అంశాలను భావితరాలకు తెలియజేసేందుకు శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వేదిక్‌ హెరిటేజ్‌ కారిడార్‌ను ప్రారంభించింది.

– ఈ అంశాలపై ‘‘భారతీయ విజ్ఞాన ధార’’ అను శీర్షికపై సోషల్‌ మీడియా, ఎస్వీబిసి ద్వారా ఒక్కో అంశం పై 10 నిమిషాలు ప్రసారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దీనిద్వారా ఆధునిక జీవన విధానంలో వేద విజ్ఞానం ఏవిధంగా ఉపయోగపడుతుందో తెలుసుకోవచ్చు. నిర్ణీత సమయంలో ఎవరైనా వచ్చి ఈ చిత్ర ప్రదర్శనను చూసి, విషయాలను తెలుసుకోవచ్చు.

జూన్‌ 7న ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ :

– మహారాష్ట్ర ప్రభుత్వం నవీ ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ 600 కోట్ల విలువైన 10 ఎకరాల భూమి టీటీడీకి కేటాయించింది. ఈ భూమిలో దాత, రేమాండ్స్‌ కంపెనీ అధినేత శ్రీ గౌతమ్‌ సింఘానియా రూ.100 కోట్ల వ్యయంతో శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం నిర్మించనున్నారు. జూన్‌ 7న ఈ ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్‌ సిండే, ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్‌ ఇతర ప్రముఖులు భక్తులు పాల్గొంటారు.

– తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో మే 31వ తేదీన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణం కోసం భూమిపూజ నిర్వహించాం. ఈ ఆలయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం టీటీడీ కి 10 ఎకరాల భూమి కేటాయించింది.

జమ్మూలో శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ :

– సనాతన హైందవ ధర్మప్రచారంలో భాగంగా టీటీడీ దేశవ్యాప్తంగా అన్ని ముఖ్య పట్టణాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తోంది. ఇటీవల సీతంపేట, రంపచోడవరంలో నిర్మించిన శ్రీవారి ఆలయాల్లో ఆగమోక్తంగా మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

– జమ్మూలోని మజీన్‌ గ్రామంలో శ్రీవారి ఆలయం నిర్మాణం కోసం జమ్ము `కాశ్మీర్‌ ప్రభుత్వం 60 ఎకరాల భూమి కేటాయించింది. ఆభూమిలో దాదాపు రూ.30 కోట్ల వ్యయంతో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జూన్‌ 3 నుండి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నాం. 8వ తేదీ జరిగే మహాసంప్రోక్షణలో జమ్ముకాశ్మిర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా , కేంద్ర మంత్రులు శ్రీ కిషన్ రెడ్డి, జితేంద్ర ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

వైద్య సేవలు

– టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న బర్డ్‌ ఆసుపత్రిలో ఇటీవల ఒకే రోజు ఆరుగురికి కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌ అపరేషన్లు, ఆరుగురికి గ్రహణమొర్రి అపరేషన్లను ప్రముఖ వైద్య నిపుణులు విజయవంతంగా నిర్వహించారు . అదేవిధంగా ఈ ఏడాది ఇప్పటిదాకా 50 మందికి గూని నివారణ శస్త్రచికిత్సలు నిర్వహించాము.

– శ్రీ పద్మావతి హృదయాలయంలో 20నెలల వ్యవధిలోనే 1450 మంది చిన్నారులకు
ఉచితంగా గుండె అపరేషన్లు నిర్వహించాము . క్లిష్లమైన గుండె అపరేషన్లు కూడా ఆరోగ్య శ్రీ లేదా ఆయుష్మాన్‌ భారత్‌ స్కీంల కింద, ప్రాణదానం ట్రస్టు సహకారంతో నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలు కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. మూడు గుండెమార్పిడి ఆపరేషన్లు కూడా విజయవంతంగా నిర్వహించాము.

నకిలీ ఉద్యోగ ప్రకటనలతో మోసపోకండి

– టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంత మంది వ్యక్తులు సామాజిక మాధ్యమాల ద్వారా నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల మీద ఐటి విభాగం ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. నిరుద్యోగులు ఇలాంటి ప్రకటనలు నమ్మి మోస పోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.

మే నెలలో నమోదైన వివరాలు :

దర్శనం :

– శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య ` 23.38 లక్షలు

హుండీ :

– హుండీ కానుకలు ` రూ.109.99 కోట్లు

లడ్డూలు :

– విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య ` 1 కోటి 6 లక్షలు

అన్నప్రసాదం :

– అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య ` 56.30 లక్షలు

కల్యాణకట్ట :

– తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య ` 11 లక్షలు

ఈ కార్యక్రమంలో జేఈవో లు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎస్వీ బీసీ సిఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ నాగేశ్వరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.