HIGHLIGHTS OF SRI SITA RAMA KALYANAM AT VONTIMITTA _ శ్రీ సీతారాముల కల్యాణంలో భక్తజన సందోహం

•  Nearly 80 thousand devotees witness the celestial Kalyanam 

 

•  Extensive coordinated arrangements by TTD-District Administration 

 

•  Devotees expresses immense satisfaction about the facilities and Thank AP CM for the celestial grandeur of the event.

 

•  121 spacious galleries were set up in the Kalyana Vedika premises and steps were taken to ensure that devotees could sit comfortably and watch the wedding ceremony.

 

•  TTD provided pearl thalambras, Srivari laddu prasadam and bangles to every devotee who attended the wedding.

 

•  A kit containing lemon rice, kesari, biscuit packets, mango juice, water bottle, sweet and kara ingredients was given to each devotee. 

 

•  Around 2600 Srivari sevaks under the supervision of about 50 Senior Sevaks  continuously distributed buttermilk packets and drinking water to the devotees in the galleries.

 

•  Special sheds were set up near the temple in 11 areas for the waiting devotees.

 

–  Panakam, buttermilk, chillers, water coolers and staff were made available.

 

 * 21 LED screens were set up to watch the celestial wedding of Sri Sita Rama. 

 

•  TTD also ran 20 free buses from traffic diversion areas to the wedding venue for the convenience of devotees

 

•  13 medical camps, 35 medical experts, 250 paramedical staff and 8 ambulances were kept ready to provide necessary medical services to the devotees.

 

•  As part of sanitation, 250 toilets were set up and 3,268 sanitation workers performed their duties.

 

•  The wedding was broadcast in HD quality through SVBC, and lakhs of devotees from all over the world watched and enjoyed spiritual bliss.

 

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                        

 

శ్రీ సీతారాముల కల్యాణంలో భక్తజన సందోహం 

 

•  దాదాపు 80 వేల మంది భక్తులు 

 

•  టీటీడీప్రభుత్వ సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు

 

•  సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసిన రామభక్తులు 

 

•  ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు

 

ఒంటిమిట్ట / తిరుపతి, 2026 ఏప్రిల్ 01: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో దాదాపు 80 వేల మంది భక్తులు పాల్గొని స్వామివారి దివ్య కళ్యాణాన్ని భక్తిశ్రద్ధలతో వీక్షించారు.

 

టీటీడీకి చెందిన అన్ని విభాగాలు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశాయి ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు.

 

•  కల్యాణ వేదిక ప్రాంగణంలో విశాలమైన 121 గ్యాలరీలను ఏర్పాటు చేసిభక్తులు సౌకర్యవంతంగా కూర్చుని కల్యాణోత్సవాన్ని వీక్షించేలా చర్యలు తీసుకున్నారు.

 

•  కల్యాణానికి విచ్చేసిన ప్రతి భక్తుడికి ముత్యాల తలంబ్రాలుశ్రీవారి లడ్డూ ప్రసాదంకంకణాలను టీటీడీ అందించింది.

 

•  ప్రతి భక్తుడికి లెమన్ రైస్‌కేసరిబిస్కెట్ ప్యాకెట్‌మ్యాంగో జ్యూస్‌వాటర్ బాటిల్‌స్వీట్‌కారా పదార్థాలతో కూడిన కిట్‌ను అందజేశారు

 

•  గ్యాలరీలలో భక్తులకు శ్రీవారి సేవకులు నిరంతరం మజ్జిగ ప్యాకెట్లుతాగునీరు పంపిణీ చేశారు.

 

•  నడిచి వచ్చే భక్తుల కోసం 11 ప్రాంతాల్లోఆలయ సమీపంలో 3 వేల మంది భక్తులు వేచి ఉండేలా ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేశారుపానకంమజ్జిగచలివేంద్రాలువాటర్ కూలర్లుసిబ్బంది అందుబాటులో ఉంచారు.

 

•  శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు 21 ఎల్ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు

 

•  అలాగే ట్రాఫిక్ డైవర్షన్ ప్రాంతాల నుండి కల్యాణ వేదిక వరకు టీటీడీ 20 ఉచిత బస్సులను నడిపింది.

 

•  భక్తుల ఆరోగ్య పరిరక్షణకు 13 వైద్య శిబిరాలు, 35 మంది వైద్య నిపుణులు, 250 మంది పారామెడికల్ సిబ్బంది, 8 అంబులెన్సులు సిద్ధంగా ఉంచి అవసరమైన వైద్యసేవలు అందించారు.

 

•  పారిశుద్ధ్య పరిరక్షణలో భాగంగా 250 మరుగుదొడ్లు ఏర్పాటు చేసి, 3,268 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహించారు.

 

•  సుమారు 2,600 మంది శ్రీవారి సేవకులుప్రభుత్వపోలీస్టీటీడీ సిబ్బంది సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించారు.

 

  • శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని ఎస్వీబీసీ ద్వారా హెచ్‌డీ నాణ్యతతో ప్రసారం చేయగాప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు వీక్షించి ఆధ్యాత్మికానందాన్ని పొందారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది