HOUSE SITES TO ALL IS MY RESPONSIBILITY – TTD CHAIRMAN TO RETIRED EMPLOYEES _ మీ ఇంటిస్థలాలకు నాదీ బాధ్యత -టీటీడీ రిటైర్డ్ ఉద్యోగులకు చైర్మన్ శ్రీభూమన కరుణాకర రెడ్డి హామీ

TIRUPATI, 16 September 2023: Providing house sites to all the TTD employees including the retired is his prime responsibility, asserted TTD Chairman Sri B Karunakara Reddy.

He held a meeting with TTD retired employees and leaders association at his residence in Padmavathipuram on Saturday evening. 

On this occasion, the Chairman said that he is a person who treats every employee as his own family member.  He recalled that when Dr. YS Rajasekhara Reddy was the Chief Minister, he had given house plots to the employees during his earlier stint as TTD Chairman. 

He said that the subsequent Governments did not think and try to solve this problem for 15 years.  “Sri Venkateswara Swamy has once again given me an opportunity and I am working wholeheartedly to provide homes to all the employees, including retired.  He said that he met Chief Minister Sri YS Jaganmohan Reddy several times about this matter and first got 300 acres of land granted. 

The TTD Board Chief also said that the Chief Minister has issued instructions to the District Collector to grant another 250 acres of land to give house plots to the retired employees as well.

Many leaders said that under the leadership of Sri Karunakara Reddy, they will surely get justice.  They requested that the pending court case on Poor Home and Dairy Farmland should also be resolved.  The Chairman said that he will help the retired employees to the extent possible to overcome the legal difficulties.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మీ ఇంటిస్థలాలకు నాదీ బాధ్యత – వివాదాలతో మళ్ళీ వాటిని దూరం చేసుకోవద్దు

టీటీడీ రిటైర్డ్ ఉద్యోగులకు చైర్మన్ శ్రీభూమన కరుణాకర రెడ్డి హామీ

తిరుపతి 16 సెప్టెంబరు 2023: ” మీ ఇంటి స్థలాలకు నాదీ బాధ్యత. ఏ ఒక్కరినీ నిరాశ పరచను. గతంలో నేను చైర్మన్ గా ఉన్నప్పుడు మీకు ఇంటిస్థలాలు ఇప్పించాను. మళ్ళీ నేనే మీకు ఇంటిస్థలాలు ఇప్పించాలని నిర్ణయం తీసుకున్న్నాను” అని టీటీడీ చైర్మన్, శాసన సభ్యులు శ్రీ భూమన కరుణాకర రెడ్డి హామీ ఇచ్చారు.

పద్మావతి పురంలోని తన నివాసంలో శనివారం సాయంత్రం టీటీడీ రిటైర్డ్ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్బంగా చైర్మన్ శ్రీ కరుణాకర రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగులను తన సొంత మనుషులుగా చూసుకునే వ్యక్తినని ఆయన చెప్పారు. గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, టీటీడీ చైర్మన్ గా ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇప్పించిన విషయం ఆయన గుర్తు చేశారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు 15 సంవత్సరాలుగా ఈ సమస్యను పరిష్కరించే ఆలోచన, ప్రయత్నం చేయలేదన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి మరోసారి తనకు అవకాశం ఇచ్చారని, రిటైర్డ్ ఉద్యోగులతో సహా , ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇప్పించాలని మనస్ఫూర్తిగా పని చేస్తున్నానని ఆయన తెలిపారు. ఈ విషయం గురించి అనేక సార్లు ముఖ్యమంత్రిని కలసి మొదట 300 ఎకరాల భూమి మంజూరు చేయించానని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఇంటి స్థలాలు ఇప్పించడానికి మరో 250 ఎకరాల భూమి మంజూరు చేయించడానికి ముఖ్యమంత్రి ద్వారా జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేయించానని ఆయన చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం వద్దని , వివాదాలు సృష్టించుకోకుండా ఇప్పటికైనా సమస్య పరిష్కరించుకోవాలని
శ్రీ కరుణాకర రెడ్డి హితవు చెప్పారు. శ్రీ కరుణాకర రెడ్డి హామీతో రిటైర్డ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. పలువురు నాయకులు మాట్లాడుతూ, శ్రీ కరుణాకర రెడ్డి నేతృత్వంలో తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పారు. పూర్ హోం, డైరీ ఫామ్ ఇంటిస్థలాలపై ఉన్న కోర్టు కేసును త్వరగా పరిష్కరించి తమకు న్యాయం జరిగేలా సహాయం చేయాలని వారు కోరారు. రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయ పరంగా ఉన్న ఇబ్బందులు తొలగించడానికి ఏ మేరకు సహాయం చేయవచ్చో ఆమేరకు చేస్తానని చైర్మన్ చెప్పారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది