IGNORING  STUDIES BRINGS DARKNESS IN LIFE -TTD CHAIRMAN _ విద్యను నిర్లక్ష్యం చేస్తే జీవితం అంధకారమే _ టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి

Tirupati, 23 November 2023: TTD Chairman Sri Bhumana Karunakara Reddy cautioned students that if they ignore studies now it would spread darkness in their lives and in the future.

Addressing the inauguration of 79 th anniversary of the Sri Venkateswara Arts College students union on Thursday evening, as its chief guest, the TTD Chairman said students should strive to ensure the realization of their parent’s dreams towards a good education and build up bright careers.

He said good education shapes the personality and future of students and hence they should study not only textbooks but also improve their general knowledge. He cautioned that student life and time are invaluable and if misused it would ruin their entire life.

TTD JEO for Health and Education Smt Sada Bhargavi said if students study well they could achieve important positions in their career.

TTD DEO Dr. Bhaskar Reddy, College Principal Dr. Narayanamma, Vice-Principal Dr. Satyanarayana, College retired Principal Dr Christopher, Education Advisor Dr Mohan Reddy, college student union president Sri Sunil, Secretary Sri Harikrishna  Prasad, faculty and students were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

విద్యను నిర్లక్ష్యం చేస్తే జీవితం అంధకారమే – టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి

తిరుపతి 23 నవంబరు 2023 ; చదువు కోవాల్సిన సమయంలో మెదడు నిండా చెడు ఆలోచనలను నింపుకుని విద్యను నిర్లక్ష్యం చేస్తే జీవితం అంధకారం అవుతుందని టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర రెడ్డి విద్యార్థులను హెచ్చరించారు. బిడ్డల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులు ఎన్నో కలలుకని కష్టపడతారని ఆయన చెప్పారు. తల్లిదండ్రుల కలలు నెరవేర్చడానికి తాము ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నామని ప్రతి విద్యార్థి ప్రతి రోజు మననం చేసుకోవాలని ఆయన కోరారు.

శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల 79వ విద్యార్ధి సంఘం ప్రారంభోత్సవం గురువారం సాయంత్రం జరిగింది. చైర్మన్ శ్రీ కరుణాకర రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అథితి గా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు తమను తాము తీర్చి దిద్దుకోవడానికి, పాడు చేసుకోవడానికి కళాశాల చదివే వయసు ఉపయోగపడుతుందన్నారు. డిగ్రీ అయ్యాక మరో మూడేళ్ళు కష్టపడి బాగా చదివితే 70 ఏళ్ళు బాగా జీవించవచ్చని చెప్పారు. చదువు వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దే ఆయుధమని, విద్యార్థులు పాఠ్య పుస్తకాలతో పాటు జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు కూడా బాగా చదవాలన్నారు. కాలం చాలా విలువైనదని, దుర్వినియోగం చేసుకుంటే జీవితం ఎగతాళి అవుతుందనే విషయం గుర్తు పెట్టుకోవాలని శ్రీ కరుణాకర రెడ్డి విద్యార్థులకు సూచించారు.
తాను 1977లో ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో చదివే రోజుల్లో విద్యార్ధి సంఘం నాయకుడిగా అనేక కార్యక్రమాలు నిర్వహించానన్నారు. తనకు విద్య, నడత, జ్ఞానం నేర్పించిన గురువులను ఆయన స్మరించుకున్నారు. కళాశాలలో ఎన్నో పోరాటాలు చేసినా చదువును మాత్రం

విస్మరించలేదన్నారు. తరగతులు ఎగ్గొట్టే వాడిని కాదనీ, లైబ్రరీలో కూడా ఎక్కువకాలం గడిపే వాడినని తన జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. విద్యార్ధి సంఘం నాయకుడిగా శ్రీశ్రీ, , త్రిపురనేని మహారథి లాంటి అనేక మంది ప్రముఖులను పిలిపించి విద్యార్థులకు ఉపయోగపడే ప్రసంగాలు ఇప్పించానని చెప్పారు.

తాను మొదటి సారి టీటీడీ చైర్మన్ గా పనిచేసిన సమయంలో విద్యార్థులందరికీ ఉచితంగా భోజనం అందిస్తూ నిర్ణయం తీసుకున్నానని చైర్మన్ చెప్పారు.
జేఈవో శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని చెప్పారు.

దేవస్థానం విద్యాధికారి డాక్టర్ భాస్కర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణమ్మ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ, కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ డాక్టర్ క్రిస్టోఫర్, విద్యాశాఖ సలహా దారు డాక్టర్ మోహన్ రెడ్డి, కళాశాల విద్యార్ధి సంఘం అధ్యక్ష్యుడు సునీల్, కార్యదర్శి హరికృష్ణ ప్రసాద్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది