IMPRESSIVE CULTURAL PROGRAMS IN TIRUMAL AND TIRUPATI _ తిరుమల,తిరుపతిలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
Tirupati, 25 September 2025: On the second day of the annual Brahmotsavams of Srivaru on Thursday, several artists performed Bharatanatyam under the auspices of TTD Dharmic Projects at Mahathi auditorium in Tirupati.
Classical dances like Muddugare Yashoda, Dashavatara Stuti Pradamaya Palkadali, Adivo Alladivo, Jayajaya Devi, Ksheerabdhikanyaku, and Ekadantaya Vakrathundaya entertained the audience.
Similarly, the cultural events in Ramachandra Pushkarini and Annamacharya Kalamandiram also impressed the art lovers.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
తిరుమల,తిరుపతిలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
తిరుపతి, 2025 సెప్టెంబరు 25 ;శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన గురువారం తిరుపతి మహతి కళాక్షేత్రంలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో పలువురు కళాకారుల భరతనాట్య నృత్యం విశేషంగా అలరించాయి.
ఇందులో భాగంగా మహతి కళాక్షేత్రంలో కర్ణాటకకు చెందిన ఎమ్ పి సుజీంద్రబాబు బృందం కల్పశ్రీ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ట్రస్ట్ వారు తమ నృత్య కళాకారులతో సంప్రదాయ భరతనాట్య నృత్యం సభను భక్తిమయ సాగరంలో ఓలలాడించింది.
ముద్దుగారే యశోదకు, దశావతార స్తుతి ప్రదమైన పాల్కడలి, అదివో అల్లదివో, జయజయ దేవి, క్షీరాబ్ధికన్యకకు, ఏకదంతాయ వక్రతుండాయ వంటి నృత్యములు భక్తజన ప్రేక్షకులను అలరించింది.
ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో తిరుపతి పురవాసులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.











