IMPRESSIVE RELIGIOUS AND DEVOTIONAL MUSICAL PROGRAMS _ ఆకట్టుకున్న ధార్మిక, సంగీత కార్యక్రమాలు

Vontimitta/Tirumala, 08 April 2025: On the third day of the ongoing annual Brahmotsavam of Sri Kodandarama Swamy temple in Vontimitta, on Tuesday, the religious and devotional musical programs organized by TTD captivated the devotees.

As a part of this, in the forenoon session, Sri Venkataramana spoke on the topic “Tara, Mandodari Matalu” and said that both Tara and Mandodari were important characters in the epic Ramayana. Tara was the wife of Vali, and Mandodari was the wife of Ravana and both of them tried to advise their husbands and guide them on the right path.

Later, from 2 pm to 4 pm, the Annamacharya Project artists Sri Srinivas, Sri Sugunakar and Sri Pawan Kumar performed a devotional Harikatha  on “Tulsi Jalandhara”. 

From 6 pm to 7 pm, there will be a Kuchipudi dance performance by the Lavanya troupe from Hyderabad.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ఆకట్టుకున్న ధార్మిక, సంగీత కార్యక్రమాలు

ఒంటిమిట్ట / తిరుపతి, 2025 ఏప్రిల్ 08: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు మంగ‌ళ‌వారం టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఇందులో భాగంగా ఉద‌యం 10 నుండి 11 గంట‌ల వ‌ర‌కు శ్రీ వెంక‌ట‌ర‌మ‌ణ‌ “తార, మండోదరి మాట‌లు” అనే అంశంపై మాట్లాడుతూ, తార, మండోదరి ఇద్దరూ రామాయణంలో ముఖ్యమైన పాత్రలని తెలిపారు. తార వాలి భార్య, మండోదరి రావణుని భార్య, ఇద్దరూ తమ భర్తలకు సలహా ఇస్తూ, వారిని మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేశారన్నారు.

వాలిని యుద్ధానికి వెళ్ళే ముందు, సుగ్రీవుడితో శాంతింపమని, దౌత్యపరమైన చర్యల‌తో శాంతియుతంగా జీవించమని, ఉన్నతమైన రాముడితో స్నేహం చేయమని కోరింద‌న్నారు. వాలి ఆమె హెచ్చరికను తోసిపుచ్చడంతో యుద్ధంలో మ‌ర‌ణించిన‌ట్లు వివ‌రించారు.

అదేవిధంగా మండోదరి రావణుడిని మంచి మార్గంలో నడిపించేందుకు ప్రయత్నించింది, కానీ విఫలమైంద‌న్నారు.

అనంత‌రం మ‌ధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీ శ్రీ‌నివాస్‌, శ్రీ సుగుణాక‌ర్‌, శ్రీ పవన్ కుమార్ బృందం ” తులసీ జలంధర” పై
హరికథ గానం భక్తిభావాన్ని పంచాయి.

సాయంత్రం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు హైద‌రాబాద్‌కు చెందిన లావ‌ణ్య బృందం కూచిపూడి నృత్య ప్ర‌ద‌ర్శ‌న నేత్ర‌ప‌ర్వంగా జ‌రిగింది.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.