IMPRESSIVE RELIGIOUS AND MUSICAL FETE AT SRIVARI BRAHMOTSAVAM _ శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో ఆక‌ట్టుకున్న ధార్మిక‌, సంగీత కార్య‌క్ర‌మాలు

Tirumala, 05 October 2024: On Saturday, the second day of Srivari annual Brahmotsavam, the Nada Neerajanam and Asthana Mandapam platforms in Tirumala reverberated to rhythms and music enthralling audiences.

The cultural programs were organised under the auspices of TTD Hindu Dharmic Projects.

From 4.30 am to 5.30 am on Nada Neerajanam stage, Sri. Muniratnam, Sri Krishnamurthy, Sri. Krishna Rao team of SV Sangeet Nritya College performed enchanting Mangala Dhwani.

From 5:30 am to 6:30 am Sri Ramachandra Ghanapati of Rajahmundry gave religious discourse on “ Vedopadesam-Loka Kalyana Pradam” .Later in the evening from 4pm to 5 pm Srinidhi group from Hyderabad sang Annamayya sankirtans.

‘Vishnu Sahasranama Parayanam’ by smt. Seetharamanujamma from Hyderabad was observed at Asthana Mandapam from 7 am to 8 am.

Devotional music by was rendered by smt. Reshma Madhusudan from Bangalore from 10 to 11:30 am and followed Sri Jaganmohana from Hyderabad. 

From  11:30 am to 12:30 pm Acharyas lectures on ‘Bhagavad Gita under the Alwar prabanda project also held.

Later, from 4pm to 5.30 pm, smt. Sushila group from Tirupati sang Annamacharya Sankeerthans melodiously. From 5:30 pm to 7 pm Harikatha was performed by Smt Varalakshmi group from Tirupati.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో ఆక‌ట్టుకున్న ధార్మిక‌, సంగీత కార్య‌క్ర‌మాలు

తిరుమ‌ల‌, 2024 అక్టోబరు 05: శ్రీవారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో రెండ‌వ రోజైన శ‌నివారం తిరుమ‌ల‌లోని నాద నీరాజనం, ఆస్థాన మండపంలో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ధార్మిక, సంగీత కార్య‌క్ర‌మాలు ఆక‌ట్టుకున్నాయి.

తిరుమల నాద నీరాజనం వేదికపై ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాలకు చెందిన శ్రీ మునిరత్నం, శ్రీ కృష్ణమూర్తి, శ్రీ కృష్ణారావు బృందం మంగళ ధ్వని, ఉదయం 5:30 నుండి 6:30 గంటల వరకు రాజమండ్రికి చెందిన శ్రీ రామచంద్ర ఘనాపాటి “వేదోపదేశం- లోక కళ్యాణ ప్రదం” అనే అంశంపై ఉపన్యసించారు. తర్వాత సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన శ్రీమతి శ్రీనిధి బృందం అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు.

ఆస్థాన మండపంలో ఉదయం 7 నుండి 8 గంటల వరకు హైదరాబాద్ కు చెందిన శ్రీమతి సీతారామాంజునమ్మ ‘విష్ణు సహస్రనామ పారాయణం’ ఉదయం 10 నుండి 11:30 గంటల వరకు బెంగళూరుకు చెందిన శ్రీమతి రేష్మ మధుసూదన్ బృందం భక్తి సంగీతం, ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు హైదరాబాదుకు చెందిన శ్రీ జగన్మోహన ఆచార్యులు ‘ ఆళ్వార్ ప్రబంధాలలో భగవద్గీత’ అనే అంశంపై ఉపన్యసించారు. అనంతరం సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి సుశీల బృందం అన్నమాచార్య సంకీర్తనలను సుమధురంగా ఆలపించారు. సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి వరలక్ష్మి బృందం హరికథ గానం చేశారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.