IMPRESSIVE RELIGIOUS AND MUSICAL PROGRAMS AT BRAHMOTSAVAMS _ బ్రహ్మోత్సవాల్లో ఆకట్టుకున్న ధార్మిక, సంగీత కార్యక్రమాలు
TIRUMALA, 23 SEP 2023: On the 6th day of Srivari annual Brahmotsavams in Tirumala impressive religious and musical programs were organized under the auspices of TTD Hindu Dharmic Projects at various venues in Tirumala and Tirupati on Saturday.
Vishnusahasranama Parayanam by Srimati Padmavati Devi Group, Devotional Music by Srimati Madhavilatha Group and Acharya Chakravarti Ranganadhan Bhaktamrita Dharmikopanyasam were given at Asthanamandapam in Tirumala.
In the evening, Dr. Mathusudan Rao’s group performed Annamayya Vinnapalu and Smt. Jotsna and the team performed Harikatha Parayanam.
From 6.30 pm to 8.30 pm at Mahathi Auditorium, Tirupati, devotional music by Nadalaya Surabhi group, Sri Gopala Rao team gave a devotional musical concert at Annamacharya Kalamandiram, Srivalli team performed Bharatnatyam in Sri Ramachandra Pushkarini which impressed the art lovers.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
బ్రహ్మోత్సవాల్లో ఆకట్టుకున్న ధార్మిక, సంగీత కార్యక్రమాలు
తిరుమల, 2023 సెప్టెంబరు 23 ; శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 6వ రోజైన శనివారం తిరుమల, తిరుపతిలోని పలు వేదికలపై టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
తిరుమలలోని ఆస్థానమండపంలో ఉదయం వేద సందేశం, శ్రీమతి పద్మావతి దేవి బృందం విష్ణుసహస్రనామపారాయణం, శ్రీమతి మాధవీలత బృందం భక్తి సంగీతం, ఆచార్య చక్రవర్తి రంగనాధన్ భక్తామృతం ధార్మికోపన్యాసం చేశారు. సాయంత్రం శ్రీ మథుసూదన్‌రావు బృందం అన్నమయ్య విన్నపాలు, శ్రీమతి జోత్స్న బృందం హరికథా పారాయణం కార్యక్రమాలు నిర్వహించారు.
తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు నాదలయ సురభి బృందం భక్తి సంగీతం, అన్నమాచార్య కళామందిరంలో శ్రీ గోపాలరావు బృదం సంగీతం, శ్రీ రామచంద్ర పుష్కరిణి వేదికపై శ్రీవళ్ళి బృదం నృత్యం ప్రదర్శించారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.