INAUGURAL SESSION OF TIRUPPAVAI DISCOURSES ON DECEMBER 15 _ డిసెంబరు 15న తిరుప్పావై ప్రవచనాల ప్రారంభ సమావేశం

AT SIX VENUES IN TIRUPATI AND 233 CENTRES ACROSS THE COUNTRY

Tirupati, 13 December 2025: On the occasion of the auspicious Dhanurmasam, the Tirumala Tirupati Devasthanams (TTD) is organising Tiruppavai discourses with eminent scholars from December 16 to January 14 in Six venues at Tirupati and in 233 centres across the country.

As part of this programme, the inaugural meeting of the Tiruppavai discourses will be held on December 15 at 5:30 pm at the Annamacharya Kalamandiram, Tirupati under the aegis of the TTD Alwar Divya Prabandha Project. 

Both the Pontiffs of Tirumala, and other officials will participate in this programme.

Acharya Chakravarti Ranganathan will deliver the Tiruppavai discourse on the occasion.

Until the conclusion of Dhanurmasam, Tiruppavai discourse recitations will be held daily at the following venues in Tirupati and Tirumala:

Nada Neerajanam Platform, Tirumala

Annamacharya Kalamandiram, Tirupati

Sri Varadaraja Swamy Temple, KT Road

Sri Govindaraja Swamy Temple, Tirupati

Sri Lakshmi Narayana Swamy Temple, South Mada Street

Tholappa Mandapam near Sri Govindaraja Swamy Chariot

Gita Mandir near Ram Nagar Quarters

Sri Venkateswara Swamy Temple, LS Nagar

In addition, Tiruppavai discourse programmes will be conducted at 233 centres across the states of Andhra Pradesh, Telangana, Tamil Nadu, Karnataka, Puducherry, Maharashtra, and Odisha.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

డిసెంబరు 15 తిరుప్పావై ప్రవచనాల ప్రారంభ సమావేశం

తిరుప‌తిలో ఆరు చోట్ల ప్ర‌వ‌చ‌నాలు

దేశ‌వ్యాప్తంగా 233 కేంద్రాలు

తిరుపతి, 2025 డిసెంబర్ 13: పవిత్రమైన ధనుర్మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో డిసెంబరు 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు తిరుపతితోపాటు దేశవ్యాప్తంగా 233 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. 

ఈ క్రమంలో డిసెంబరు 15న సాయంత్రం 5.30 గంటలకు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుప్పావై ప్రవచనముల ప్రారంభ సమావేశం జరుగనుంది.

టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుమ‌ల శ్రీశ్రీశ్రీ‌ పెద్దజీయర్ స్వామి, తిరుమ‌ల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఇత‌ర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆచార్య చక్రవరి రంగనాథన్ తిరుప్పావై ప్రవచనం చేస్తారు.

ధనుర్మాసం ముగిసే వరకు తిరుమ‌ల‌లోని నాదనిరాజనం వేదిక, తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, కెటి రోడ్డులోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయం, శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం దక్షిణ మాడవీధిలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామివారి ఆలయం, శ్రీ గోవిందరాజ స్వామి వారి తేరుకు సమీపంలోని తొలప్ప మండపం, రామ్ నగర్ క్వార్టర్స్ వద్ద ఉన్న గీతా మందిరం, ఎల్ ఎస్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆల‌యంలో ప్రతిరోజు తిరుప్పావై ప్రవచనాల పారాయణం జరుగుతుంది.

 అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, మ‌హారాష్ట్ర‌, ఒడిశా రాష్ట్రాల్లోని 233 కేంద్రాల్లో తిరుప్పావై ప్రవచన కార్యక్రమాలు జరుగనున్నాయి.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.