Inauguration of E Darshan Counters in Tirupati _ తిరుపతిలో ఇ-దర్శన్ కౌంటర్లు ప్రారంభించిన టిటిడి ఛైర్మన్
Tirupati, 2 Jun. 22: Sri D.K.Audikesavulu has inaugurated e _darshan counters at mahathi auditorium, Sri Vari Sannidhi in Tirupati on Friday morning. Speaking on this occasion the chairman said that 72 e _darshan counters were already functioning at different places in the country for the benefit of the pilgrims. The visiting devotees to the Tirupati will certainly use these counters for their accommodation, sevas darshan facilities here after he added.
Sri I.Y.R.Krishna Rao, Executive Officer, Sri Nageswara Rao, Executive Engineer, Sri Bhaskar, EDP Manager and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుపతిలో ఇ-దర్శన్ కౌంటర్లు ప్రారంభించిన టిటిడి ఛైర్మన్
తిరుపతి, 2010 జూన్ 18: భక్తులసౌకర్యార్థమై తిరుపతిలోని మహతిఆడిటోరియం నందు, కపిలతీర్థం రోడ్డు నందు గల శ్రీవారి సన్నిది నందు ఇ-దర్శన్ కౌంటర్లను తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీడి.కె.ఆదికేశవులు శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా పాలకమండలి చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగాను తితిదే భక్తుల సౌకర్యార్థం ఇదివరకే 72 ఇ-దర్శన్ కౌంటర్లను ప్రారంభించిందని, నేడు 73,74న కౌంటర్లను ప్రారంభించామని తెలిపారు.
ఈ కౌంటర్లలలో సుదర్శనం, సుప్రభాతం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్రదీపాలంకర సేవ, నిజపాద దర్శనం, అష్టదలపాద పద్మారాధన సేవల టిక్కెట్లు, దర్శన టిక్కెట్లతోపాటు, వసతి కూడా బుక్ చేసుకునే సౌలభ్యం ఉందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో తితిదే ఇ.ఓ, ఎస్.ఇ.|, ఇ.ఇ.|| , తదితర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.