Inauguration of Training classes for Fisherman community _ హైందవ మత వ్యాప్తికి అవిరళ కృషి : శ్రీ ఐ.వై.ఆర్ కృష్ణారావు
Agama Advisor Sri Vedatham Vishnubattacharyulu, A.P Fishermen Welfare Society President Sri Koduri Jayaram and SVETA Director Sri Bhuman were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
హైందవ మత వ్యాప్తికి అవిరళ కృషి : శ్రీ ఐ.వై.ఆర్ కృష్ణారావు
తిరుపతి, జూన్-30, 2009: తమ ధర్మ ప్రబోధం ద్వారా సామాన్య మానవుడి చెంతకు మతాన్ని తీసుకెళ్ళిన భగవద్రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు, జయదేవుడు, తులసీదాసు, మరెంతమందో మహానుభావులవలె తితిదే కూడా హైందవ మత వ్యాప్తికి అవిరళ కృషి చేస్తుందని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్.కృష్ణారావు అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక శ్వేతనందు మత్స్యకార పూజారులకు పూజావిధానంపై శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఇఓ మాట్లాడుతూ హిందూమతం అనేది ఒక జీవన విధానం అని, ఇది అనేక విధానాల సమ్మేళనం అని, ఇతర మతాలవలె మద్యలో పుట్టిందికాదని, హిందూ మతానికి ప్రారంభంలేదని అదే విధంగా అంతం కూడా లేదని, భవిష్యత్తులో హందూమతం కొంతపుంతలు తొక్కుతూ దినదినాభివృద్ది చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సామాన్యులకు పూజా విధానంలో సముచిత శిక్షణ ఇచ్చి వారిలో మన సనాతన ధార్మిక భక్తి ప్రపత్తులపై అవగాహన కల్గించి, సమాజంలో వారికి సమున్నత స్థానాన్ని, గౌరవాన్ని పెంపొందించడంలో ఈ పూజావిధానం శిక్షణా తరగతులు గొప్పగా ఉపకరిస్తాయని ఆయన తెలిపారు. ఎక్కడైతే మన ఆచార వ్యవహారాలు చేరడం లేదో, అక్కడ అవి చేరడానికి ఇంతకు మించి శిక్షణ మరొకటి లేదు అని ఆయన అన్నారు. అదే విధంగా శ్వేతలో ఇటువంటి మంచి కార్యక్రమాలనూ ఇంకా ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు.
అనంతరం ఆయన హైదరాబాద్‌లో జూలై 2,3,4వ తేదీలలో నిర్వహిచనున్న అష్టోత్తర శత కుండాత్మక మహావరుణయాగం పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో 56 మంది మత్స్యకార పూజారులు, శ్వేతడైరెక్టర్ శ్రీభూమన్, స్థానికాలయాల ఆగమ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.