Inauguration on new premises for ANNADANAM in Tiruchanur _ శ్రీపద్మావతి అమ్మవారి భక్తులకు ఉచిత భోజన సౌకర్యం
శ్రీపద్మావతి అమ్మవారి భక్తులకు ఉచిత భోజన సౌకర్యం
తిరుపతి, మే-4,2009: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకోవడానికి విచ్చేసే వేలాదిమంది భక్తులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ డి.కె.ఆదికేశవులు చెప్పారు. సోమవారం ఉదయం తిరుచానూరు ఆస్థానమండపం క్రింద గల సెల్లార్ నందు ఆధునికరించిన భవనాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా తితిదే చైర్మన్ మాట్లాడుతూ తిరుమలకు విచ్చేసే భక్తులకు ఏవిధంగా అన్నదానం జరుగుచున్నదో, అదే విధంగా తిరుచానూరులో సైతం జరుగుచున్నదని, ప్రస్తుతం ఆధునీకరించిన ఈ భవనము నందు ఒకసారి దాదాపు 500 మంది కలసి భోజనం చేసే సౌకర్యంవున్నదని, ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం వున్నందున ఎక్కువ మంది కలసి భోజనం చేసేవిధంగా నూతన అన్నదానం కాంప్లెక్స్‌ను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు.
అంతకుమునుపు ఈ సెల్లార్ నందు ఏర్పాటు చేసిన పూజలో చైర్మన్‌తో పాటు ఇ.ఓ శ్రీకె.వి.రమణాచారి పాల్గొన్నారు. పిదప ఆయన భక్తులకు అన్నప్రసాదాల్ని వడ్డించి, వారితో కలసి భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో తితిదే జెఇఓ శ్రీవి.శేషాద్రి, ఛీఫ్ ఇంజనీర్ శ్రీవి.ఎస్.బి.కోటేశ్వరరావు, అన్నదానం డిప్యూటీ ఇ.ఓ శ్రీమతి చెంచులక్ష్మి, క్యాటరింగ్ ఆఫీసర్ శ్రీశాస్త్రి, ఆలయ డిప్యూటీ ఇ.ఓ శ్రీడిల్లీబాబు, ఎస్.ఇ. లు శ్రీరమేష్‌రెడ్డి, సుధాకర్, మురళీధర్‌లు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.