INCREASE BIO-WALL IN TIRUMALA-EO_ తిరుమ‌ల ఘాట్‌రోడ్ల‌ల‌లో పచ్చదనం పెంపుకు చ‌ర్య‌లు: టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 17 Jun. 19: TTD EO Sri Anil Kumar Singhal on Monday directed forest officials to enhance greenery in Tirumala.

During the senior officers meeting held at a conference hall in TTD Administrative Building in Tirupati, the EO instructed the DFO Sri Phani Kumar Naidu to enhance the Bio wall by developing greenery especially on ghat roads of Tirumala and in all junctions at Tirupati.

Later he also directed the officials concerned to erect noise less fans in temple and compartments in Tirumala. Then he asked the SVBC to come out with animated series of mythological stories to muse pilgrims waiting compartments.

The EO also reviewed on Kapilatheertham, Narapura Venkateswara Swamy temple, Valmikipuram temple development activities.

DyEO Smt Goutami IAS, CVSO Sri Gopinath Jatti, CE Sri Chandrasekhar Reddy and other officers were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమ‌ల ఘాట్‌రోడ్ల‌ల‌లో పచ్చదనం పెంపుకు చ‌ర్య‌లు: టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతి, 2019 జూన్ 17: తిరుమలకు విచ్చేసే భక్తులకు మ‌రింత ఆహ్లాదం పంచేందుకు ఘాట్‌రోడ్ల‌కు ఇరువైపులా సువాసనలు వెదజల్లే ఆకర్షణీయమైన రంగురంగుల పూల మొక్కలతో పచ్చదనం పెంపునకు కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్ అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలోని స‌మావేశ మందిరంలో సోమ‌వారం ఈవో, అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రానున్న వ‌ర్ష‌కాలం దృష్ట్యా ప‌చ్చ‌ద‌నం పెంపుకు ముంద‌స్తుగా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌న్నారు. తిరుమ‌ల‌లోని ప‌ద్మావ‌తి అతిథి భ‌వ‌నం, రాంభ‌గీఛ‌, అన్న‌ప్ర‌సాదం, సిఆర్‌వో త‌దిత‌ర భ‌క్తుల ర‌ద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల‌లో బ‌యోవాల్ (హ‌రిత ప్ర‌హ‌రీలు) ప‌నుల‌ను పూర్తి చేయాల‌న్నారు. తిరుప‌తిలోని అలిపిరి, నంది స‌ర్కిళ్ల వ‌ద్ద‌ ఆక‌ర్ష‌ణీయంగా ఉండేలా ప‌లుర‌కాల పూల‌మొక్క‌లు పెంచేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు.

ఆల‌యంలో త‌క్కువ శ‌బ్దంతో కూడిన ఫ్యాన్లు మ‌రికొన్ని ఏర్పాటు చేయాల‌న్నారు. అదేవిధంగా కంపార్టుమెంట్ల‌ల‌లో వేచివుండే భ‌క్తుల‌కు భ‌క్తితో కూడిన యానిమేష‌న్, భ‌క్తి చిత్రాల‌ను ప్ర‌సారం చేయాల‌న్నారు. తిరుమ‌ల ఆల‌య నాలుగు మాడ వీధులలో విజిలెన్స్‌, ఎస్వీబీసీ, ఎల‌క్ట్రిక‌ల్ త‌దిత‌ర శాఖ‌లు స‌మ‌న్వ‌యం చేసుకుని భూగ‌ర్భ వైరింంగ్ ప‌నుల‌ను వేగ‌వంతంగా పూర్తి చేయాల‌న్నారు. నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాలు, శ్రీ‌వారి పుష్క‌రిణి చుట్టూ జ‌రుగుతున్న అభివృద్ది ప‌నులు, మరుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్ ప‌నుల‌ను త్వ‌రిత గ‌తిన పూర్తి చేయాల‌న్నారు.

తిరుప‌తి క‌పిల‌తీర్థంలోని శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో క‌ల్యాణ క‌ట్ట‌, కార్యాల‌య ప‌నుల పురోగ‌తిపై స‌మీక్ష‌నిర్వ‌హించారు. అదేవిధంగా జ‌మ్మ‌ల‌మ‌డుగులోని శ్రీ న‌రాపుర వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం నాలుగు మాడ వీధులలో మ‌ర‌మ‌త్తు ప‌నులు, ప్రాకారం, వాల్మీకిపురంలోని శ్రీ ప‌ట్టాభిరామ‌స్వామివారి ర‌థ మండ‌పం ప‌నులు పూర్తి చేయాల‌న్నారు. తిరుప‌తిలోని శ్రీ గోవిందరాజ‌స్వామి కాలేజి హ‌స్ట‌ల్ గ‌దుల మ‌ర‌మ‌త్తు ప‌నుల పురోగ‌తిపై స‌మీక్షించారు. టిటిడి స్థానిక ఆల‌యాలలో భ‌క్తుల భ‌ద్ర‌త, వైద్య సౌక‌ర్యాలు, ఇటి, త‌దిత‌ర అంశాల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాధ్ జెట్టి, సిఇ శ్రీ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, ఎఫ్ ఎ అండ్ సిఏవో శ్రీ బాలాజి, డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి గౌత‌మి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.