INTEGRITY PLEDGE ADMINISTERED IN TIRUMALA AND TIRUPATI _ తిరుపతిలో టిటిడి ఉద్యోగులు సమగ్రతా ప్రతిజ్ఞ
Tirupati, 01 Nov 19 ; The Integrity Pledge has been administered in Tirumala and Tirupati by the employees as a part of the Vigilance Awareness Week on Friday under the aegis of Vigilance Department of TTD.
All the employees working in TTD administrative building, educational institutions, hospitals have taken the Integrity Pledge including the students in Tirupati.
While the departments in Tirumala administered oath with their employees in the presence of the respective HoDs.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుపతిలో టిటిడి ఉద్యోగులు సమగ్రతా ప్రతిజ్ఞ
తిరుపతి, 2019 నవంబరు 01 ;విజిలెన్స్ అవగాహన వారోత్సవంలో భాగంగా తిరుపతిలో శుక్రవారం టిటిడి విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో వివిధ విభాగాల ఉద్యోగులు సమగ్రతా ప్రతిజ్ఞ చేశారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ పిలుపు మేరకు “సమగ్రతా ప్రతిజ్ఞ ” నిర్వహించారు.
కేంద్ర విజిలెన్స్ కమిషన్ యాక్ట్ – 2003కి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు కేంద్ర, రాష్ట్ర భుత్వాలలోని అన్ని విభాగాలు ప్రతి ఏడాది ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. తద్వారా దేశ ఆర్థిక స్థితి గతులు అభివృద్ధి పరుచుట, రాజకీయంగా ఉన్నత ప్రమాణాలు, సామాజిక పరంగా పురోభివృద్ధి సాధించేందుకు అవినీతి ప్రతిబంధకంగా ఉండటం వలన దానిని నిర్ములించే ఉద్దేశంతో అక్టోబరు 28 నుండి నవంబరు 2వ తేదీ వరకు టిటిడిలో విజిలెన్స్ అవగాహన వారోత్సవం నిర్వహిస్తున్న విషయం విదితమే.
ఇందులోభాగంగా శుక్రవారం ఉదయం 10.15 గంటలకు తిరుపతిలోని టిటిడి పరిపాన భవనం, టిటిడి విద్యాసంస్థలు, వైద్యశాలలు, ఇతర కార్యాలయాలలో విధులు నిర్వహించే సిబ్బంది, ఇతర ఉద్యోగులు కలిసి ప్రతిజ్ఞ చేశారు. అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేస్తామని, త్రికరణ శుద్ధితో భక్తులకు సేవ చేస్తామని, టిటిడి ప్రతిష్టకు భంగం కలగకుండా నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.
టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో విజివో శ్రీ అశోక్‌కుమార్ గౌడ్, ఎవిఎస్వో శ్రీ నందీశ్వర్, శ్రీ నారాయణ, శ్రీ పవన్‌కుమార్, శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు, ఉద్యోగులు, ఇతర నిఘా, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.