INTERNATIONAL 63rd CHALLENGED PERSONS DAY OBSERVED _ టీటీడీలో ఘనంగా 63వ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

Tirupati, 04 December 2023: The 63rd International Challenged Persons’ Day was observed in a grand manner at TTD Administrative Buildings in Tirupati on Monday.

 

On the ocassion, TTD  Welfare Officer Smt Snehalata presented awards to nine challenged persons including blind and dumb who excelled in their fields. She also gave away prizes to winners of sports events held on November 27.

 

Speaking on the occasion some specially abled employees complimented TTD Chairman Sri Bhumana Karunakara Reddy, TTD EO Sri AV Dharma Reddy, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam for giving permission to observe the event.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

టీటీడీలో ఘనంగా 63వ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

తిరుపతి, 2023 డిసెంబరు 04: టీటీడీ ఆధ్వర్యంలో మొదటిసారిగా 63వ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని సోమవారం తిరుపతిలోని పరిపాలన భవనంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా విధుల్లో ఉత్తమ సేవలు అందించినందుకు గాను శారీరక వికలాంగులు, అంధులు, బధిరుల విభాగాల్లో మొత్తం తొమ్మిది మందికి టీటీడీ సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత చేతులమీదుగా అవార్డులు ప్రదానం చేశారు. అదేవిధంగా నవంబరు 27న నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి మహిళలు, పురుషుల విభాగాల్లో బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు దివ్యాంగ ఉద్యోగులు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సహకరించిన టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డికి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఇఇ శ్రీ మనోహరం, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు శ్రీ జె.భాస్కర్, శ్రీ రెడ్డెప్పరెడ్డి, శ్రీ సునీల్ కుమార్, శ్రీ రవికుమార్, శ్రీ తులసి, టీటీడీ ఉద్యోగులు శ్రీ ప్రసాదరావు, శ్రీమతి ఇందిర, శ్రీ వెంకటరమణారెడ్డి, శ్రీ నాగార్జున, శ్రీ వాసు, శ్రీ చీర్ల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.