IOB DONATES SCANNER TO TTD _ టీటీడీకి స్కానర్ విరాళం
Tirupati, 26 August 2025: The Indian Overseas Bank (IOB), Tirupati, has donated a Smith Detection Hi-Scanner machine worth ₹61.72 lakhs to TTD.
The IOB Director Sri Chandra Reddy and Regional Manager, Sri Sanjay Kumar Jha handed over the scanner to TTD Executive Officer Sri J. Syamala Rao at the TTD Administrative Building in Tirupati on Tuesday,
The scanner will be installed near the Srivari Temple Ugranam in Tirumala, to check raw materials before they are used in preparing Laddu Prasadams and Annaprasadams.
Tirumala IOB Manager Sri Mahesh Babu, Marketing Officer Sri Rajasekhar Reddy, and other officials also participated in this event.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
టీటీడీకి స్కానర్ విరాళం
తిరుపతి 2025 ఆగస్టు 26: తిరుపతి రీజనల్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వారు టిటిడికి రూ.61.72 లక్షల విలువ గల స్మిత్ డిటెక్షన్ హై స్కాన్ విరాళంగా అందించారు.
తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో కార్యాలయంలో మంగళవారం ఐఓబి డైరెక్టర్ శ్రీ చంద్రారెడ్డి, రీజనల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ ఝా రూ. 61.72 లక్షల మంజూరు కాపీని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావుకుఅందించారు.
తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో గల ఉగ్రహణం నుండి లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాదాల తయారీలో వినియోగించే ముడి సరుకులను శ్రీవారి పోటుకు పంపించే ముందు తనిఖీ చేసేందుకు ఈ స్కానర్ ను వినియోగించనున్నారు.
ఈ కార్యక్రమంలో తిరుమల ఐఓబి మేనేజర్ శ్రీ మహేష్ బాబు, మార్కెటింగ్ ఆఫీసర్ శ్రీ రాజశేఖర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

