ITS A DAY OF FOLK DANCES _ పల్లకీ సేవలో ఆకట్టుకున్న చండ మేళం, లెస్యూమ్స్ నృత్యం, కోలాటాల ప్రదర్శనలు
TIRUPATI, 02 DECEMBER 2024: The cool and peaceful day on Monday witnessed a series of unique folk art forms from various artists in Tiruchanoor during Mohini Avataram.
The dances included Keelu Gurralu, Kommu Koya, Gondu, Kolatam, besides Odissi dance.
A total of 250 artists belonging to a dozen groups participated and allied the devotees with their performances.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
పల్లకీ సేవలో ఆకట్టుకున్న చండ మేళం, లెస్యూమ్స్ నృత్యం, కోలాటాల ప్రదర్శనలు
తిరుపతి, 2024 డిసెంబరు 02: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం పల్లకీ సేవలో చండ మేళం, చండ మేళం, లెస్యూమ్స్ నృత్యం, కోలాటాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 12 కళాబృందాలు 250 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు.
చండమేళం
కర్ణాటక ఉడిపిలోని పాలిమర్ మఠంకు చెందిన బెల్ కలై చండీ మేళం బృందం 5 ఏళ్లుగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చండమేళం(కేరళ డ్రమ్స్) వాయిస్తున్నారు. ఈ బృందంలో మొత్తం 8 మంది కళాకారులు ఉన్నారు. వీరు డ్రమ్స్, తాళాలు లయబద్ధంగా వాయిస్తూ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యం చేశారు.
కర్ణాటక రాష్ట్రం మైసూరుకు చెందిన 33 మంది యువతులు లెస్యూమ్స్ నృత్యం, తిరుపతి ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో మోహిని అవతారం నృత్యరూపకం, భరతనాట్యం, కూచిపూడి, కోలాటాల ప్రదర్శన ఆకట్టుకుంది.
తెలంగాణ రాష్ట్రం హైదరాబాదుకు చెందిన 25 మంది యువతుల బృందం, కొమ్ము – కోయ, గోండు డ్యాన్స్ లతో నయనానందకరంగా సాగింది.
కర్ణాటకకు చెందిన 17 మంది యువతులు ఒడిసి నృత్యం, రాజమండ్రికి చెందిన 30 మంది యువతుల సాంప్రదాయ జానపద నృత్యం, పలమనేరుకు చెందిన 15 మంది కళాకారుల కీలుగుర్రాలు, అనంతపురం శ్రీకృష్ణ నాట్య మండలికి చెందిన 30 మంది యువతుల గోపి కృష్ణ నృత్యాలు భక్తులను పరవశింప చేశాయి.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది