JAGANMOHANAKARA BLESSES DEVOTEES _ మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు

Tirupati, 24 Feb. 22: Sri Kalyana Venkateswara dressed as the beautiful universal damsel, Jaganmohini mesmerized the devotees on the finely decked palanquin on Thursday morning as part of the ongoing annual brahmotsavams at Srinivasa Mangapuram.

 

Temple DyEO Smt Shanti and other temple staff participated in this unique Seva in Ekantam.

 

ANDAL MALAS TO KALYANA VENKATESWARA

 

As the Garuda Vahana seva will be observed in the evening, Andal Sri Goda Devi malas from Sri Govindaraja Swamy temple will be decked in Garuda Vahana Seva.

 

HH Sri Pedda Jeeyar and Sri Chinna Jeeyar Swamiji’s of Tirumala, Special Grade DyEO Sri Rajendrudu, DyEO Smt Shanti and others were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు

తిరుపతి, 2022 ఫిబ్ర‌వ‌రి 24: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన గురువారం ఉదయం శ్రీ‌నివాసుడు మోహినీ అలంకారంలో, తిరుచ్చిపై శ్రీ కృష్ణుడు అభయమిచ్చారు.

మాయా మోహ నాశ‌నం :

సకల లోక కల్యాణకారకుడు అయిన శ్రీ కల్యాణ శ్రీ‌నివాసుడు దివ్యమోహినీ రూపంలో ఉత్సవమూర్తియై, తిరుచ్చిపై కృష్ణుడు భక్తులను తన కృపాకటాక్షాలతో అనుగ్రహించారు. ఆ దివ్య మోహినీ మాయాశక్తికి వశమైన జగత్తు వాహ్య వాహకభేదాన్ని గుర్తుంచుకోలేకపోయింది. కనుక శ్రీవారు జగన్మోహినియై పల్లకీలో కూర్చొని ఉంటారు. ఈనాటి శ్రీవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సత్త్వస్వరూప సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తుంది.

ఆండాళ్‌ అమ్మవారి మాలలు :

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం రాత్రి జరుగనున్న గరుడ సేవలో అలంకరించేందుకు ఉదయం శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి ఆండాళ్‌ అమ్మవారి మాలలను తీసుకెళ్లారు.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మాలలకు పూజ‌లు చేసిన‌ అనంతరం అర్చకులు వాహ‌నంలో శ్రీ‌నివాసమంగాపురానికి తీసుకెళ్లారు. ఈ మాలలను శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి మూలవిరాట్‌కు అలంకరించారు. రాత్రి జరిగే శ్రీవారి గరుడ సేవలో ఈ మాలలను స్వామివారికి అలంకరిస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం దంపతులు, శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, శ్రీనివాసమంగాపురం ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్లు శ్రీ చెంగ‌ల్రాయులు, శ్రీ రమణయ్య, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజి రంగాచార్యులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.