JANMASHTAMI AND UTLOSAVA FESTS IN TIRUMALA ON SEPTEMBER 7&8 _ తిరుమలలో శ్రీ కృష్ణ జన్మాష్టమి, ఉట్లోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

Tirumala, 06 September 2023: TTD has made grand arrangements for the celebrations of Sri Krishna Janmashtami fete on September  7 and 8.

Similarly, Panchabhisekam will be performed to the Kaliyamardana statue of Sri Krishna at Gogarbham Dam on the morning of Sept.7 followed by Prasadam distribution.

On September 8  Utlotsavam fete will be conducted along four Mada streets with Sri Malayappaswami, and Sri Krishna Swami procession on separate Tiruchis. The divine event would attract a large number of young pilgrims and devotees.

In view of the day-long festivities, the TTD has canceled the Arjita Sevas of Kalyanotsavam, Unjal  Seva, Arjita Brahmotsavam, and Sahasra Deepalankara Sevas on September 8.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమలలో శ్రీ కృష్ణ జన్మాష్టమి, ఉట్లోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

తిరుమల, 2023 సెప్టెంబ‌రు 06 ; తిరుమలలో సెప్టెంబ‌రు 7, 8వ తేదీల్లో జరుగనున్న శ్రీ కృష్ణజన్మాష్టమి, ఉట్లోత్సవ వేడుకలకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత గురువారం రాత్రి 8 నుండి 10 గంటల నడుమ గోకులాష్టమి ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు.

అదేవిధంగా గోగర్భం డ్యామ్‌ చెంత వెలసియున్న ఉద్యానవనంలో కాళీయమర్ధనుడు అయిన శ్రీకృష్ణుడుకి ఉదయం 10.30 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల వ‌ర‌కు పంచాభిషేకాలు ఘనంగా జరుగనున్నాయి. తరువాత ప్రసాద వితరణ కార్యక్రమం జరుగనుంది.

సెప్టెంబ‌రు 8వ తేదీ శుక్ర‌వారం తిరుమలలో ఉట్లోత్సవాన్ని మధ్యాహ్నం 4 గంటల‌ నుండి రాత్రి 8 గంటల మధ్య ఆలయ నాలుగు మాడ వీధులలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉట్లోత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ తిలకిస్తారు. యువకులు ఎంతో ఉత్సాహముతో ఉట్లను కొడుతూ స్వామివార్లకు ఆనందాన్ని చేకూర్చుతారు.

ఈ ఉట్లోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబ‌రు 8వ తేదీన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.