JEO BHARGAVI INSPECTS KARTHIKA DEEPOTSAVAM ARRANGEMENTS _ తిరుప‌తిలో కార్తీక దీపోత్సవం ఏర్పాట్ల‌ను పరిశీలించిన జేఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి

Tirupati,19 November 2023: TTD JEO for Health and Education Smt Sada Bhargavi on Sunday inspected the arrangements for Karthika Deepotsavam to be observed at the Parade Grounds on November 20.

Speaking on the occasion the JEO said the Deepotsavam program is scheduled to be held in Tirupati on November 20, Kurnool on 27 and Visakhapatnam on December 11.

She said the auspicious program is conducted by TTD in the month of Karthika to herald the significance of Siva-Keshava since 2021 under the aegis of All Dharmic Projects of TTD.

All preparations are being made for the program between 6pm and 8pm at the parade grounds of the TTD Administrative Building and the entire festival of lights would be telecasted live on the SVBC channel for the sake of devotees. 

She said over 2000 devotees are being anticipated in the program in which students of TTD educational institutions would perform 

Vishnu Sahasranama Parayanams.

After the inspection, the JEO reviewed the arrangements with officials and made valuable suggestions.

As part of the ceremonies the Yati Vandanam, Veda Swasti and the significance of the Deepalankara Seva will be explained by scholars. The students and artists of SV College of Music and Dance would also present a dance ballet on Harihara after the Viswaksena puja, Punyahavachanam, Vishnu Sahasranama Stotra Parayanam and Sri Maha Lakshmi puja.

Later Sri Lakshmi Niranjanam, Govinda Nama Parayanam by Annamacharya project artists and Mangala Harati followed by Naivedyam, Nakshatra Harati and Kumbha Harati will also be observed.

VC of SV Vedic University Acharya Rani Sadasiva Murthy, DyEO Sri Govindarajan, VGO Sri Bali Reddy, Program Officer of All Dharmic Projects Sri Rajagopal, SV College of music and dance Principal Smt Uma Muddubala and other officials were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుప‌తిలో కార్తీక దీపోత్సవం ఏర్పాట్ల‌ను పరిశీలించిన జేఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి

తిరుపతి, 2023 నవంబరు 19: తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో నవంబరు 20 వ తేదీ సోమవారం కార్తీక దీపోత్సవాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించాలని జేఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి అధికారుల‌ను ఆదేశించారు. దీపోత్సవం ఏర్పాట్ల‌ను ఆమె ఆదివారం పరిశీలించారు.

ఈ సంద‌ర్భంగా జేఈవో శ్రీమతి సదా భార్గవి మీడియాతో మాట్లాడారు . పవిత్రమైన కార్తీక మాసంలో నవంబరు 20న తిరుపతిలో, నవంబరు 27న కర్నూలులో, డిసెంబరు 11న వైజాగ్ లో దీపోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. ధర్మప్రచారంలో భాగంగా శివకేశవుల వైశిష్ట్యం, మహిళలకు దీపం ప్రాశస్త్యాన్ని తెలిపేందుకు 2021వ సంవత్సరం నుండి టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. టీటీడీ పరిపాలనా భవనంలోని మైదానంలో ఏర్పాట్లు పూర్తి కావచ్చాయన్నారు . సోమవారం సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌ని ఆమె తెలిపారు .ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని జేఈవో చెప్పారు . మైదానంలో దాదాపు 2 వేల మంది కూర్చునేందుకు  వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సందర్భంగా టీటీడీ విద్యార్థులతో విష్ణుసహస్రనామ పారాయణం నిర్వహిస్తామన్నారు.

అనంత‌రం జేఈవో అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమ సరళికి సంబంధించి పలు సూచనలు చేశారు. వేదికపై సుంద‌రంగా పుష్పాలంక‌ర‌ణ‌లు, విద్యుత్ దీపాలంక‌ర‌ణ‌లు చేయాలన్నారు. పారిశుధ్య నిర్వహణకు అద‌న‌పు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

కార్యక్రమంలో భాగంగా యతివందనం, సందర్భ పరిచయం, వేద స్వస్తి తరువాత దీప ప్రాశస్త్యాన్ని వివరిస్తారు. అనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం, శ్రీ మహాలక్ష్మీ పూజ, ఎస్వీ సంగీత కళాశాల ఆధ్వర్యంలో హరిహరుల నృత్య రూపకం ప్రదర్శిస్తారు. ఆ తరువాత సామూహిక లక్ష్మీ నీరాజనం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో గోవిందనామాలు, మంగళాచరణం ఆలపిస్తారు. చివరగా నైవేద్యం, నక్షత్ర హారతి, కుంభహారతి ఇస్తారు.

ఎస్వీ వేదవర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, విజివో శ్రీ బాలిరెడ్డి, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి శ్రీ రాజగోపాల్, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి ఉమా ముద్దుబాల ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.